Viral Video: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేళ.. కలిసిన కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:15 PM
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేళ.. పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇద్దరు ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు.
న్యూడిల్లీ, జూన్ 26: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేళ.. పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇద్దరు ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. అయిత గతంలో వీరిద్దరు కలిసి బాలీవుడ్‌లో ఓ సినిమా చేసిన సంగతి చాలా మందికి తెలియదు. 2011లో మిలే నా మిలే హమ్ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు.
ఈ చిత్రం విడుదల అయితే అయింది కానీ హిట్ మాత్రం సాధించలేదు. దీంతో చిరాగ్ పాశ్వాన్ సినిమా రంగానికి గుడ్ బై చెప్పేశారు. అనంతరం తన ఇష్టమైన రాజకీయ రంగంలోకి ఆయన ప్రవేశించారు. కానీ కంగనా రనౌత్ మాత్రం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంతేకాదు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించింది. తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విక్రమాదిత్యపై 75 వేల ఓట్ల మెజార్టీతో కంగనా రనౌత్ గెలిచింది. దీంతో సినీ పరిశ్రమలోనే కాదు.. రాజకీయ రంగంలో సైతం తాను రాణించగలనని తన ప్రత్యర్థులకు కంగన క్లియర్ కట్‌గా ఓ సందేశాన్ని ఇచ్చినట్లు అయింది.
Also Read: AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు
మరోవైపు లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్. రాజకీయాల్లో తండ్రి అడుగు జాడల్లో చిరాగ్ నడిచారు. అయితే తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో చిరాగ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో చిరాగ్ పార్టీ 5 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో ఎల్‌జేపీ కీలక భాగస్యామ పక్షంగా నిలిచింది.
Also Read: Viral Video: కవితా మజాకా? ఓ చేతిలో పిల్లోడు.. మరో చేతిలో..?
ఇక మోదీ కేబినెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా చిరాగ్ కొనసాగుతున్నారు. గతంలో రెండు సార్లు జుమాయి నుంచి చిరాగ్ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో హజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. ఇంకోవైపు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఒకే చిత్రంలో వీరిద్దరు నటించారు. ప్రస్తుతం ఇలా పార్లమెంట్ వేదికగా ఒకరునొకరు కలుసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
For More National News and Latest Telugu News click here