Share News

Train Accident: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్.. మూడు బోగీల్లో..

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:20 AM

దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ట్రైన్ ఎక్కాలంటేనే వామ్మో.. అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది.

Train Accident: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్.. మూడు బోగీల్లో..
train

West Bengal: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల రైలు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడు ఏ రైలు పట్టాలు తప్పుతుందో.. ఏ ట్రైన్‌లో మంటలు వస్తాయో అర్థంకావడం లేదు. తాజాగా, పశ్చిమ బెంగాల్ లోని నల్పూల్ రైల్వే స్టేషన్‌లో సమీపంలో రైలు ప్రమాదం తప్పింది. నల్పూర్ లోని హౌరా జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో సిక్రింద్రాబాద్ - శాలీమార్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ లోని నల్పూల్ రైల్వే స్టేషన్‌లో సమీపంలో ఉదయం 5.31గంటలకు ఈ ట్రైన్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి.


అంతరాయం:

వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకుని ప్రయాణికులను సమీప స్టేషన్‌కు తరలించారు. అయితే, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మత్తులు వేగవంతం చేపట్టారు. ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఈ రూట్ లో ట్రైన్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో ప్రయాణికులతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


ప్రయాణికులు సేఫ్..

ఈ రైలు ప్రమాదంపై సౌత్ ఈస్టర్న్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓం ప్రకాష్ చరణ్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో 22850 సికింద్రాబాద్ శాలీమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు వెల్లడించారు. మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు మారుతున్న సమయంలో ఒక పార్శిల్ వ్యాన్, రెండు ప్యాసింజర్ కోచ్‌లు పట్టాలు తప్పాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ప్రయాణికులందరూ సేఫ్‌గా ఉన్నారని అన్నారు. ప్రయాణికులను సమీప స్టేషన్‌కు తరలించేందుకు 10 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రెండు ప్రయాణికుల బోగీలు, మరో పార్సిల్ వ్యాన్ పట్టాలు తప్పినట్లు తెలిపారు. ట్రాక్ పునరుద్ధరించే పనిలో రైల్వే సిబ్బంది నిమగ్నమైనట్లు చరణ్ అన్నారు. త్వరగా ట్రాక్ లను క్లియర్ చేసి సాధారణ సర్వీసులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.


Also Read:

ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారు..

లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ వార్నింగ్

మాజీసీఎం సంచలన కామెంట్స్.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..

For More Telugu and National News

Updated Date - Nov 09 , 2024 | 11:24 AM