Bengal train collision: బెంగాల్‌లో రైలు ప్రమాాదాన్ని 'కవచ్' నివారించలేదా.. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..?
ABN , Publish Date - Jun 17 , 2024 | 03:30 PM
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరగడంతో కవచ్ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒకే పట్టాపై రెండు రైళ్లు వస్తున్నప్పుడు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో రైల్వే శాఖ తీసుకొచ్చిన కవచ్ వ్యవస్థను తీసుకొచ్చింది.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరగడంతో కవచ్ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒకే పట్టాపై రెండు రైళ్లు వస్తున్నప్పుడు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో రైల్వే శాఖ తీసుకొచ్చిన కవచ్ వ్యవస్థను తీసుకొచ్చింది. రైల్వే రక్షణ వ్యవస్థ- కవచ్‌ను తీసుకొచ్చిన తర్వాత ప్రమాదాలు జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఎన్నో రైలు ప్రమాదాలు జరగకుండా కవచ్ వ్యవస్థ చూడగలిగింది. కానీ డార్జిలింగ్ జిల్లాలో చోటుచేసుకున్న తాజా ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఇప్పటికే రైల్వే శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఇదే సమయంలో కవచ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్‌లోని కొన్ని మార్గాల్లో ఈ వ్యవస్థ అమలవుతున్నప్పటికీ.. తాజాగా ప్రమాదం జరిగిన మార్గంలో ఈ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదని రైల్వే శాఖ తెలిపింది. కవచ్ విఫలం కావడం వలన ప్రమాదం జరగలేదని.. ఈ మార్గంలో కవచ్ అందుబాటులో లేకపోవడంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే ఉద్యోగులు సహా 15 మంది మరణించారు. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని సిల్చార్ నుండి కోల్‌కతాలోని సీల్దాకు వెళుతుండగా.. న్యూ జల్పాయిగురికి సమీపంలోని రంగపాణి స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుండి వచ్చిన గూడ్స్ రైలు కాంజన్‌జంగాను ఢీకొట్టింది.
Bengal train accident: రైలు ప్రమాద స్థలికి అశ్విని వైష్ణవ్... ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు
కవచ్ ఎలా పనిచేస్తుందంటే..
కవచ్ రైల్వే రక్షణ వ్యవస్థలో భాగంగా ఉంది. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థను 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (ఐటిఎఎస్) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమలులోకి తీసుకువచ్చారు.
రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఈ కవచ్ వ్యవస్థపై అనేక ఆరోపణలు వస్తాయి. కవచ్ ఉండుంటే రైలు ప్రమాదాలు జరగవని చాలామంది చెబుతూ ఉంటారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ ఏమైందంటూ చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు రైల్వే భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రైల్వే బడ్జెట్లో సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తీసుకువచ్చారు. ప్రతి ఏడాది బడ్జెట్లో దీనికి భారీ కేటాయింపులే చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన తీసుకువచ్చిన ఈ సాంకేతికత రైల్వే ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ రైలు ప్రమాదం జరిగిన రూట్లో ఆ టెక్నాలజీ ఉందా అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.
కవచ్ ఏమిటి?
లోకోమోటివ్‌లు, ట్రాక్‌లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఇది పని చేస్తుంది. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సిస్టమ్.. అల్ట్రా-హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది.
ఉపయోగాలు
రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్., భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థలో ఎన్నో ఉపయోగాలున్నాయి. పరిశోధనలు., పరీక్షలు దాటుకుని ఈ రక్షణ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేశారు. అనేక ట్రయల్స్‌ను కవచ్ సమర్ధవంతంగా పూర్తి చేసుకుంది. ప్రయాణంలో ఉండగా రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం., సిగ్నల్ దాటడం, ఎదురెదురుగా రైళ్లు ఢీ కొట్టే పరిస్థితి ఎదురవడం, పరిమితికి మించిన వేగంతో రైళ్లు ప్రయాణించడం., రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రించకలేక పోవడం వంటి సమస్యలు ఎదురైనపుడు కవచ్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా రైలు ప్రమాదాలను పూర్తి స్థాయి ఖచ్చితత్వంతో నిరోధిస్తుంది. కవచ్ వ్యవస్థ ఏర్పాటుతో రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించి ఢీ కొట్టే ప్రమాదాలను నివారించవచ్చు.
లోకోపైలట్ కు సూచనలు
రైలు ఢీకొనడానికి ప్రధాన కారణమైన లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు కవాచ్ హెచ్చరిస్తుంది. సిస్టమ్ లోకో పైలట్‌ను అప్రమత్తంచేస్తుంది. బ్రేక్‌లను నియంత్రించగలదు, నిర్ణీత దూరం లోపు అదే లైన్‌లో మరొక రైలును గమనించినప్పుడు స్వయంచాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది. పరికరం రైలు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది, లోకోమోటివ్‌లకు సిగ్నల్‌లను పంపుతుంది, ఇది పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా సహాయపడుతుంది.
ఎదురెదురు రైళ్లను..
రెడ్ సిగ్నల్ పడినప్పుడు లోకో పైలట్ పట్టించుకోకండా ఆ రైలును ముందుకు తీసుకెళ్లినట్లయితే ఈ కవచ్ అనే వ్యవస్థ గుర్తించి ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. ట్రాక్ బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, అలాగే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి రైళ్లను ఆపేలా చేస్తుంది. అంతేకాకుండా వంతెనలు, మలుపుల ఉన్న ప్రాంతాల్లో కూడా రైలు వేగాన్ని తగ్గించేలా చేస్తుంది. అయితే పశ్చిమబెంగాల్‌లో రైలు ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ లేకపోవడంతోనే ఈ ప్రమాదాన్ని ముందుగా నివారించడం సాధ్యం కాలేదని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
Train Collision: రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన కేంద్రం
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Moer National News and Latest Telugu News