MPs Salaries: మీ ఎంపీ జీతమెంతో తెలుసా?
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:17 PM
ఎట్టకేలకు లోక్ సభ(Lok Sabha Elections 2024) ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. రాష్ట్రాల్లో ఎంపీలుగా ఎన్నికైన వారే కేంద్రంలో సర్కార్‌ని ఎన్నుకుంటారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. అయితే ఎంపీల జీతం(MPs Salaries) ఎంతుంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా.
ఢిల్లీ: ఎట్టకేలకు లోక్ సభ(Lok Sabha Elections 2024) ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. రాష్ట్రాల్లో ఎంపీలుగా ఎన్నికైన వారే కేంద్రంలో సర్కార్‌ని ఎన్నుకుంటారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. అయితే ఎంపీల జీతం(MPs Salaries) ఎంతుంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా. ఇప్పుడు తెలుసుకుందాం.
MP జీతాలు..
MP నెలకు రూ.1లక్ష జీతం పొందుతారు. 2018లో వీరి వేతనాన్ని పెంచారు.
అలవెన్సులు, ప్రోత్సాహకాలు
MPలు నియోజకవర్గ భత్యం రూపంలో నెలకు రూ.70,000 అందుకుంటారు.
కార్యాలయ ఖర్చులు
ఒక పార్లమెంటు సభ్యుడు ఎంపీ కార్యాలయ ఖర్చుల కోసం నెలకు రూ.60,000 అందుకుంటారు. ఇందులో స్టేషనరీ సామగ్రి సిబ్బంది జీతాలు మొదలైనవి ఉంటాయి.
రోజువారీ భత్యం
పార్లమెంటరీ సెషన్‌లు, కమిటీ సమావేశాల సమయంలో ఎంపీలు బస చేయడానికి, వారి ఆహార ఖర్చుల కోసం రోజుకు రూ.2,000 భత్యం ఇస్తారు.
ప్రయాణ భత్యం
ఏడాదిలో 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉచిత ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణం కూడా చేయొచ్చు. ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలో రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు మైలేజ్ అలవెన్సులను కూడా అందుకోవచ్చు.
హౌసింగ్, వసతి
MPలకు 5 సంవత్సరాల పదవీకాలంలో ప్రధాన ప్రాంతాల్లో అద్దె రహిత వసతి ఇస్తారు. సీనియారిటీని బట్టి బంగ్లాలు, ఫ్లాట్లు, హాస్టల్ గదుల్లో ఫ్రీగా ఉండొచ్చు. అధికారిక వసతి వద్దనుకున్న వారు నెలకు రూ.2,00,000 గృహ భత్యాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
వైద్య సదుపాయాలు
ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) కింద ఉచిత వైద్య సంరక్షణకు అర్హులు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స , పథకం కింద వచ్చే ప్రైవేట్ ఆసుపత్రులూ ఉంటాయి.
పింఛన్..
పదవి కోల్పోయిన అనంతరం రూ.50 వేల పింఛన్ సైతం వస్తుంది. ప్రతి ఏడాది నెలకు రూ.2,000 ఇంక్రిమెంట్ పొందుతారు.
ఫోన్, ఇంటర్నెట్
మూడు టెలిఫోన్లను ఉపయోగించుకోవచ్చు. వాటిని ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు.ఎంపీలకు సంవత్సరానికి 1,50,000 టెలిఫోన్ కాల్‌లు ఫ్రీ. వారు తమ నివాసాలు, కార్యాలయాలలో ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.
నీరు, విద్యుత్
ఎంపీలకు ఏటా 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల వరకు ఉచిత నీరు అందిస్తారు.
For Latest News and National News click here