PM Modi Tour: అనవాయితీ మార్చారు.. ఎందుకు?.. ఏమిటీ?
ABN , Publish Date - Jul 09 , 2024 | 08:48 PM
ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం సరిగ్గా నెల రోజులకు తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటనలో భాగంగా ఆయన రష్యా పర్యటనకు వెళ్లడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుంది.
న్యూఢిల్లీ, జులై 09: ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం సరిగ్గా నెల రోజులకు తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటనలో భాగంగా ఆయన రష్యా పర్యటనకు వెళ్లడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుంది. ఇక ప్రధాని మోదీ జులై 3, 4 తేదీల్లో కజికిస్తాన్ రాజధాని ఆస్తానా వేదికగా జరిగిన 24వ ది షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన ఈ సదస్సుకు హాజరు కాలేదు. అయితే ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతీ సారి ఈ సదస్సుకు హాజరువుతూ వస్తున్నారు.
కానీ ఈ ఏడాది ఈ ఎస్‌సీఓ సదస్సుకు మాత్రం ఆయన హాజరుకాకపోవడం ఏమైనా మతలబు ఉందా అనే సందేహాలు సైతం వస్తున్నాయి. అయితే ఈ సదస్సు జరిగిన జస్ట్ నాలుగు రోజులకే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇలా రష్యా పర్యటనకు వెళ్లడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. అదీకాక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతుండగా.. ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం వెనుక ఏమైన బలీయమైన కారణముందా? అనే సందేహాలు సైతం విదేశీ నేతల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Indian student: న్యూయార్క్‌లో అవినాష్ గద్దె దుర్మరణం
అదీకా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత్, రష్యా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. భారత్‌కు యూఎస్ కొంత దూరం జరిగినా.. రష్యా మాత్రం అటువంటి పని ఎన్నడూ చేయలేదు. రష్యా రక్షణ పరికరాలకు ప్రధాన సరఫరాదారుగా ఉంది. దీంతో ఈ ఇరుదేశాల సంబంధానికి గుర్తుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించడానికి భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి దౌత్యం నెరపడానికే కాదు.. చర్చలకు సైతం భారత్ పదే పదే పిలుపునిచ్చింది.
ఇది 2020లో పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా న్యూఢిల్లీ, మాస్కో మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి కాస్తా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎదిగింది. అయితే ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన ప్రతీ సారి భారత్ పొరుగు దేశాలకు వెళ్లడం ఓ ఆనవాయితీగా వస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. తొలిసారిగా అంటే.. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ.. భూటాన్ దేశ పర్యటనకు వెళ్లారు. రెండోసారి అంటే.. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ.. మాల్దీవులతోపాటు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అయితే 2024లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జీ 7 నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. చేస్తున్న విదేశీ పర్యటనకు ఇలా ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.
Also Read: Viral Video: చట్నీలో చిట్టెలుక ఎలా ఈత కొడుతుందో.. చూశారా?
ఇక ప్రధాని మోదీ తాజా రష్యా పర్యటనతో.. ఇరు దేశాల మధ్య ఉన్న బంధం మరింత బలపడనుంది. భారత్.. రక్షణ అవసరాల కోసం రష్యా కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వేళ రష్యాను దూరం చేసుకోవాలనే ఉద్దేశ్యం భారత్ ఎట్టి పరిస్థితుల్లో లేదని ప్రధాని మోదీ ఈ పర్యటనతో ఇతర దేశాలకు కూడా స్పష్టం కానుంది. అలాగే భారత్ సైతం ప్రపంచ దేశాలతో పోటి పడే స్థాయికి చేరుకుందనే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వనుంది.
న్యూక్లియర్, అంతరిక్ష సహాకారం రంగాల్లో భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పటికే అభివృద్ది చెందింది. అలాగే పెరుగుతున్న చమురు ధరల ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడానికి రష్యా చమురును తగ్గింపు ధరలకు కొనుగోలు చేయడానికి పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే రష్యాపై విధిస్తున్న ఈ ఆంక్షలను భారత్ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ క్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో ఈ ద్వైపాక్షిక వాణిజ్యం 65.7 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.
Also Read: Central Ministers: ‘భోగాపురం పనులు’ పరిశీలన.. జగన్ ‘నిధులు’ దుర్వినియోగంపై విచారణ
ఇక ఐక్యరాజ్యసమితి, జి 20. బ్రిక్స్, ఎస్‌సీఓ తదితర అంశాలలో భారత్, రష్యాలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటున్నాయి. అలాగే యురేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం చేసుకోవడం ద్వారా రష్యా మరిన్ని పెట్టుబడులు పెట్టవచ్చని భారత్ ఆశిస్తుంది. అలాగే అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ), న్యూ చెన్నై వ్లాడివోస్టాక్ ఈస్టరన్ మేరిటైమ్ కారిడార్ వంటి భారత్‌తో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్‌ల్లో రష్యా అత్యంత కీలకంగా వ్యహరిస్తుంది.
అదీకాక గతంలో దేశం కోసం, దేశ భద్రత కోసం ఓ ధృడమైన నాయకుడిగా ప్రధాని మోదీ చేపట్టిన చర్యలను పుతిన్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇరు దేశాల క్షేమం కోసం ఆ యా నేతలు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న సంగతి తెలిసిందే.
Also Read: SIT's Report: హాత్రాస్ తొక్కిసలాటలో ‘కుట్ర కోణం’..!
Also Read: Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీకి సంధించిన ‘10 అంశాలు’
అయితే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. రష్యా భూభాగంపై కాలుమోపగానే అధ్యక్షుడు పుతిన్ స్పందించిన తీరు, అలాగే రష్యా దేశపు అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేయడం.. రష్యా, భారత్ మధ్య బంధాన్ని మరింత ధృడపరిచే విధంగా ఉన్నాయి. ఇక ఈ దశాబ్దంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎన్ని సార్లు కలుసుకున్నారో తెలుసా.. అక్షరాలా 17 సార్లు కలుసుకున్నారు. అదీకాక.. ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్‌లో తొక్కిసలాట ఘటనలో 121 మంది మరణించిన విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.