BJP MPs: గంభీర్, జయంత్ ఎందుకు తప్పుకున్నారు.. అసలు కారణాలు ఏంటి?
ABN , Publish Date - Mar 02 , 2024 | 06:49 PM
సాధారణంగా.. మన భారత రాజకీయాల్లో (Indian Politics) సిట్టింగ్ ఎంపీలు పోటీ నుంచి తప్పించుకోవడం అనేది చాలా అరుదు. అందునా.. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు, తమకు మరోసారి పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పడం దాదాపు అసాధ్యం. అలాంటిది.. బీజేపీకి (BJP) చెందిన ఇద్దరు ఎంపీలు గంటల వ్యవధిలోనే తాము లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని, ఆ పనుల నుంచి తమని తప్పించాలని కోరామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
సాధారణంగా.. మన భారత రాజకీయాల్లో (Indian Politics) సిట్టింగ్ ఎంపీలు పోటీ నుంచి తప్పించుకోవడం అనేది చాలా అరుదు. అందునా.. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు, తమకు మరోసారి పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పడం దాదాపు అసాధ్యం. అలాంటిది.. బీజేపీకి (BJP) చెందిన ఇద్దరు ఎంపీలు గంటల వ్యవధిలోనే తాము లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని, ఆ పనుల నుంచి తమని తప్పించాలని కోరామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఇద్దరు ఎంపీలు మరెవ్వరో కాదు.. ఒకరు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), మరొకరు జయంత్ సిన్హా (Jayant Sinha).
తొలుత తూర్పు ఢిల్లీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్.. తనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను (JP Nadda) కోరానని ఎక్స్ వేదికగా చెప్పారు. ఐదు గంటల తర్వాత జార్ఖండ్‌లోని హజారీబాగ్ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జయంత్ సిన్హా కూడా దాదాపు అలాంటి ట్వీట్ చేశారు. దీంతో.. వీళ్లిద్దరు సరిగ్గా బీజేపీ తొలి జాబితా (BJP MP Candidates First List) విడుదల అవ్వడానికి కొన్ని గంటల ముందే ఎందుకు తప్పుకున్నారు? ఇందుకు గల కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఎన్డీటీవీ (NDTV) నివేదిక ప్రకారం.. బీజేపీ ఎన్నికల యంత్రాంగం ప్రతి లోక్‌సభ స్థానంపై విస్తృతంగా సర్వేలు నిర్వహించిందని, సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత గౌతమ్ గంభీర్‌తో పాటు జయంత్ సిన్హాలను పునరావృతం చేయకూడదని నిర్ణయించుకుందని తెలిసింది. పనితీరు సరిగా లేకపోవడం వల్లే.. వాళ్లను రిపీట్ చేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఇద్దరే కాదు.. ప్రస్తుతమున్న ఎంపీల్లో కనీసం 60 మంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవచ్చని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే.. గంభీర్, జయంత్ రాబోయే ఎన్నికల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు.
గురువారం రాత్రి న్యూ ఢిల్లీలో ఐదు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో పాటు జేపీ నడ్డా (JP Nadda) తదితరులు కూడా పాల్గొన్నారు. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం.. తెల్లవారుజామున 4 గంటలకు ముగిసింది. ఇందులో భాగంగా.. పార్టీ రాణించని నియోజకవర్గాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించారని తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి