Youtube: యూట్యూబ్ చూసి ఆ పని చేశారు.. చివరికి ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:03 PM
డబ్బు సంపాదించాలంటే చదువు లేకున్నా పర్వలేదు కానీ.. టెక్నాలజీ పరిజ్ఙానం ఉంటే చాలు అని ఇద్దరు వ్యక్తులు అనుకున్నారు. అలా నేరం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
Uttar Pradesh: యూట్యూబ్ .. ఇది మంచి పనులకు ఎంత ఉపయోగపడుతుందో, చెడు పనులు చేసేందుకు కూడా అంతే ఉపయోగపడుతుంది. కొందరు కేటుగాళ్లు ఈజీ మనికు అలవాటు పడి కొత్త నేరాలకు పాల్పపడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోతుంటారు. టెక్నాలజీ పరిజ్ఙానంతో యూట్యూబ్ ను చూసి కొత్త కొత్త నేరాలు చేస్తుంటారు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలవుతారు. తాజాగా, య్యూట్యూబ్ చూసి రూ.500 నోట్లను ముద్రించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రూ. 30,000 ఫేక్ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.
స్టాంప్ పేపర్లపై..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లాలో సతీష్ రాయ్, ప్రమోద్ మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులు కంప్యూటర్ ప్రింటర్‌లో 10 రూపాయిల స్టాంప్ పేపర్లపై రూ.500 నోట్లను ముద్రించేవారు. వీరిద్దరూ సోన్‌భద్ర లోని రామ్‌గఢ్ మార్కెట్ లో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించేందుకు మరో రూ. 10,000 కర్చు చేయబోతుండగా వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి దగ్గర రూ. 500 నకిలీ నోట్లు 20 ఉన్నట్లు గుర్తించారు. అన్ని నోట్లకు ఒకే వరుస నంబర్ ఉందని పోలీసులు తెలిపారు. వాటిని నకిలీ నోట్లని గుర్తించడం చాలా కష్టమని పోలీసు సూపరింటెండెంట్ కల్ సింగ్ చెప్పారు. నిందితులు ఇద్దరూ మినరల్ వాటర్ ప్రకటనలను తయారు చేస్తారని తెలిపారు. యూట్యూబ్ ద్వారా నకిలీ నోట్లను ప్రింట్ చేయడం నేర్చుకున్నారని వెల్లడించారు. నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ఆల్టో కారు, నోట్ల ముద్రణకు ఉపయోగించే వస్తువులు, ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్, 27 స్టాంప్ పేపర్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఫేక్ కరెన్సీ..
ఇటీవల మార్కెట్లో రూ.500 నకిలీ నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నట్లు RBI గుర్తించింది. దొంగ నోట్ల ముఠాలు చిన్న చిన్న మార్కెట్లను ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఈ నకిలీ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో నోట్లను మార్చకుండా చిన్న చిన్న మొత్తాల్లో ఈ నకిలీ నోట్లను మారుస్తున్నారటా. కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణాల వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని దొంగ నోట్లను అంటగడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
Also Read:
ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారు..
పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. మూడు బోగీల్లో..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సామాన్యులకు అందుబాటు ధరల్లో..
For More Telugu and National News