Share News

Viral Video: నడిరోడ్డుపై అమ్మడి రచ్చ.. షాకిచ్చిన పోలీసులు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:11 AM

సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక జనాలు ఎటు పోతున్నారో అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా ఫేమస్ అయిపోవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు.

Viral Video: నడిరోడ్డుపై అమ్మడి రచ్చ.. షాకిచ్చిన పోలీసులు

ఉత్తరప్రదేశ్: సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక జనాలు ఎటు పోతున్నారో అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా ఫేమస్ అయిపోవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. అమ్మాయిలైతే మరీనూ.. లైవ్‌లో నగ్న ప్రదర్శనకు సైతం వెనుకాడటం లేదు. ఇక కొందరు కాస్త డిఫరెంట్‌గా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలకు సైతం వెనుకాడటం లేదు. ఇష్టానుసారంగా సెల్ఫీలు తీసుకోవడం, రీల్స్ చేయడం.. వ్లాగ్‌లు చేయడం సర్వసాధారణమై పోయింది. వీరు ఎలాగైనా పోనివ్వు పాపం వీరి పిచ్చితో అవతలి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. తాజాగా ఓ మహిళ రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో డ్యాన్స్‌ చేసి రచ్చ చేసింది. దీనిని చూసిన చాలా మంది తీవ్ర అసహనానికి గురయ్యారు. వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అంతే అది కాస్తా ఖాకీల కంట పడింది. వారు అమ్మడి గురించి ఆరా తీసే పనిలో ఉన్నారు.


ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇక యూపీలోని ఏ ప్రాంతంలో ఇది షూట్ చేశారన్నది తెలియలేదు కానీ ఓ మహిళ కారు పై నుంచి దిగింది. ఆ వెంటనే మహిళ వాహనాలను పట్టించుకోకుండా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. వీడియో తీసుకున్న తర్వాత కారు ఎక్కేసింది. ఈ వీడియో కాస్తా ట్విటర్‌లో వైరల్ అవడంతో యూపీ పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే వీడియోపై స్పందించిన యూపీ పోలీసులు.. ఆమె వాహనం నంబర్, సమయం, తేదీ, స్థలాన్ని షేర్ చేయాలని.. తాము తక్షణమే చర్య తీసుకుంటామని పోస్ట్ పెట్టారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు అయితే రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా తీసుకుంటుంటే.. మరికొందరు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అమ్మడిపై చర్య తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.


35 సెకన్ల ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో 2 లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై పెద్ద ఎత్తున లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారని ఒక నెటిజన్ పేర్కొనగా.. మరొకరు నడిరోడ్డుపై ఇలా డ్యాన్స్ చేయడం చాలా విడ్డూరంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. మరొక నెటిజన్ ఆమెకు తక్షణమే చలాన్ జారీ చేసి.. చట్టపరమైన చర్య తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఇక మరొక నెటిజన్.. అసలు బహిరంగ ప్రదేశాల్లో ఇలా రీల్స్ చేయడాన్ని నిషేధించాలని పేర్కొన్నాడు. మొత్తానికి ఆ మహిళ ఎవరో కానీ దొరికితే మాత్రం పోలీసులు వదిలేలా లేరు. తన డ్యాన్స్ ద్వారా ఫేమస్ అయ్యిందో లేదో కానీ పోలీసులకు చిక్కితే మాత్రం ఫేమస్ అయిపోయినట్టేనని నెటిజన్లు అంటున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:11 AM