Yogi Adityanath: యూపీలో 44 సీట్లు కోల్పోవడానికి కారణం అదే... తేల్చిచెప్పిన యోగి
ABN , Publish Date - Jul 15 , 2024 | 09:38 PM
యూపీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీని నిరాశకు గురిచేయగా, దీనికి కారణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టత ఇచ్చారు. మితిమీరిన ఆత్మవిశ్వాసమే పలుచోట్ల ఓటమికి కారణమని లక్నోలో జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఎం పేర్కొన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గెలిస్తే ఢిల్లీ పీఠానికి చేరువైనట్టేనని రాజకీయ పండితులు చెబుతుంటారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 2014, 2019లో ఆ పార్టీ పనితీరు, సాధించిన విజయాలను దెబ్బతీస్తూ 2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. యూపీలోని 80 సీట్లలో బీజేపీ కూటమి కేవలం 36 సీట్లకే పరిమితం కాగా, సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్దపార్టీగా నిలిచింది. ఫలితాలు బీజేపీని నిరాశకు గురిచేయగా, దీనికి కారణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పష్టత ఇచ్చారు. మితిమీరిన ఆత్మవిశ్వాసమే పలుచోట్ల ఓటమికి కారణమని లక్నోలో జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కానీయరాదని సూచించారు.
Puja Khedkar: విచారణకు ముందే దోషిగా తేల్చడం తప్పు.. తొలిసారి స్పందించిన పూజా ఖేద్కర్
''విజయంపై మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. బీజేపీ కార్యకర్తలు తమ విధులను ఎప్పుడూ సక్రమంగా నిర్వహిస్తుంటారు. వెనకడుకు వేయరు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా సురక్షితమైన వాతావరణాన్ని రాష్ట్రంలో పాదుకొలపాల్సిన బాధ్యత ఉంటుంది'' అని సదస్సులో మాట్లాడుతూ యోగి అన్నారు. పది నియోజకవర్గాల్లో త్వరలో జరగాల్సిన ఉప ఎన్నికలు, 2027 అసెంబ్లీ ఎన్నికల ప్రాధాన్యతను గుర్తెరిగి సానుకూల దృక్పథంతో కార్యకర్తలు ముందుకు వెళ్లాలన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జిల్లా పంచాయత్ అధ్యక్షులు, మేయర్లు, బ్లాక్‌హెడ్స్, చైర్మెన్, కౌన్సిలర్లు సహా ప్రతి ఒక్కరూ 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండాకు తిరుగులేదని మరోసారి చాటాలని యోగి పిలుపునిచ్చారు.
Read Latest Telangana News and National News