Share News

Youtuber Arrest: పాము విషం - రేవ్ పార్టీ కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్..

ABN , Publish Date - Mar 17 , 2024 | 04:37 PM

పాము విషం-రేవ్ పార్టీ కేసులో బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఆదివారం అరెస్టయ్యాడు. అతన్ని శనివారం విచారణకు హాజరుకాగా.. ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేశారు. త్వరలోనే ఎల్వీష్‌ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Youtuber Arrest: పాము విషం - రేవ్ పార్టీ కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్..

ఢిల్లీ: పాము విషం-రేవ్ పార్టీ కేసులో బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఆదివారం అరెస్టయ్యాడు. అతన్ని శనివారం విచారణకు హాజరుకాగా.. ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేశారు. త్వరలోనే ఎల్వీష్‌ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. గతేడాది రేవ్ పార్టీలలో పాము విషాన్ని వినోదానికి వాడినందుకు అతనితో పాటు మరో ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైంది.

నోయిడాలోని సెక్టార్ 51లో 2023 నవంబర్ 3న బాంక్వెట్ హాల్‌పై పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తొమ్మిది పాములు,విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలు, వీడియో షూట్‌ల కోసం ఎల్వీష్ యాదవ్ పాములను వినియోగించాడని ఆరోపణలు వినిపించాయి. తన యూట్యూబ్ ఛానల్‌లో అనేక పాముల వీడియోలు ఉండటంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరింది.

చేధించారిలా..

యూట్యూబ్‌లో ఎల్విష్ యాదవ్ వీడియోలను చూసిన తర్వాత, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ నేతృత్వంలోని జంతు హక్కుల సంఘం PFA (పీపుల్ ఫర్ యానిమల్స్) అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అలా రేవ్ పార్టీ చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Mar 17 , 2024 | 04:38 PM