Ayurveda : ఆకలి మందగిస్తే...
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:52 AM
మానసిక, శారీరక సమస్యలు రెండూ ఆకలిని దెబ్బతీస్తాయి. కఫం, ఒత్తిడి, అజీర్తి, నిరాశానిస్పృహలు ఆకలిని మందగిసాయి. ఆకలి మందగించినప్పుడు రుచిని కోల్పోతాం. వాంతులు ఉండవచ్చు
ఆయుర్వేదం
మానసిక, శారీరక సమస్యలు రెండూ ఆకలిని దెబ్బతీస్తాయి. కఫం, ఒత్తిడి, అజీర్తి, నిరాశానిస్పృహలు ఆకలిని మందగిసాయి. ఆకలి మందగించినప్పుడు రుచిని కోల్పోతాం. వాంతులు ఉండవచ్చు. ఏ కారణంగా ఆకలి మందగించినా మొదట శారీరకపరమైన కారణాలను విశ్లేషించుకోవాలి. వాటిలో భాగంగా ఆకలి మందగించడానికి అజీర్తి కారణమైతే మొదట ‘లంఖణం’ అనుసరించాలి. భోజనం మానేసి, తరచుగా నీళ్లు తాగాలి. ఆకలి వేసేవరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆకలి మొదలైనప్పుడు తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. అలాగే కొన్ని చిట్కాలను పాటించాలి. అవేంటంటే...
10 నుంచి 20 మిల్లీ లీటర్ల కలబంద రసాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను దంచి, నిమ్మరసం, తేనెలతో కలిపి తీసుకోవాలి.
అర చెంచా జీలకర్రను చిటికెడు రాతి ఉప్పుతో కలిపి నమిలి నీళ్లు తాగాలి.
ఆహారంలో సొంఠి, వాము, మిరియాలు చేర్చాలి.
భోజనం తర్వాత అరచెంచా త్రికుట చూర్ణాన్ని మజ్జిగ లేదా గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనానికి ముందు ఒక చెంచా హింగ్వాస్తక చూర్ణాన్ని మజ్జిగతో కలిపి తీసుకోవాలి