Share News

Diagnostics : పరీక్షలతో ఆరోగ్యరక్షణ!

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:05 AM

వయసుల వారీగా వేధించే ఆరోగ్య సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేయాలంటే, వాటిని పసిగట్టే వీలున్న ఈ పరీక్షలు వయసుల వారీగా చేయించు కుంటూ ఉండాలి.

Diagnostics : పరీక్షలతో ఆరోగ్యరక్షణ!

డయాగ్నొస్టిక్స్‌

యసుల వారీగా వేధించే ఆరోగ్య సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేయాలంటే, వాటిని పసిగట్టే వీలున్న ఈ పరీక్షలు వయసుల వారీగా చేయించు కుంటూ ఉండాలి.

  • 18వ ఏడులో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి బ్లడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి.

  • 20వ ఏట నుంచి ప్రతి ఐదేళ్లకోసారి కొలెస్టరాల్‌ పరీక్ష చేయించుకుంటూ ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే నియంత్రించవచ్చు. ఇదే వయసునుంచి మొదలుపెట్టి 40 ఏళ్లకు చేరుకునేవరకూ ప్రతి మూడేళ్లకోసారి క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామ్‌, మామోగ్రామ్‌ స్ర్కీనింగ్‌ చేయించుకుంటూ ఉంటే రొమ్ము కేన్సర్‌ను నియంత్రించవచ్చు.

  • 21వ ఏళ్ల నుంచి ప్రతి రెండేళ్లకోసారి పాప్‌స్మియర్‌, పెల్విక్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షతో కణాల మార్పులను కనిపెట్టి సర్విక్స్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలను ముందుగానే కనిపెట్టవచ్చు.

  • 45 ఏళ్ల వయసునుంచి ప్రతి మూడేళ్లకూ బ్లడ్‌ గ్లూకోజ్‌ టెస్ట్‌ చేయంచుకుంటూ ఉంటే, ప్రీ డయాబెటిస్‌ను గుర్తించవచ్చు.

  • 50 ఏళ్ల మహిళల్లో మెనోపాజ్‌ వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. కాబట్టి ఆస్టియోపొరోసిస్‌ను గుర్తించటం కోసం ఏడాదికోసారి బోన్‌ డెన్సిటీ టెస్ట్‌ చేయించుకుంటూ ఉండాలి.

Updated Date - Nov 05 , 2024 | 12:05 AM