Health Secrets : ఏకాగ్రతకు తాడాసనం
ABN , Publish Date - Aug 27 , 2024 | 03:08 AM
మన శరీర ఆకృతికి.. మానసిక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంచి శారీరక ఆరోగ్యం ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.
మన శరీర ఆకృతికి.. మానసిక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంచి శారీరక ఆరోగ్యం ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది. యోగాలో- ఇటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచే అనేక ఆసనాలు ఉన్నాయి. వీటిలో ‘తాడాసనం’ కూడా ఒకటి.
ఎలా వేయాలి?
జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది నిటారుగా నిలబడరు. ఒక వైపు కొద్దిగా వంగి ఉంటారు. దీని వల్ల వెన్నెముక దగ్గర ఉండే కండరాలలో మార్పు వస్తుంది. శరీర సమతౌల్యం సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం - ఏకాగ్రతపై కూడా పడుతుంది. అందువల్ల తాడాసనాన్ని వేసే సమయంలో శరీరపు బరువును రెండు అరికాళ్లపైన పడేవిధంగా నిలబడాలి. తర్వాత చేతులను పూర్తిగా పైకి చాపాలి. ఆ తర్వాత చేతులు రెండింటిని జోడించాలి. అలా జోడించిన తర్వాత నడుము కదలకుండా ఛాతి భాగాన్ని వెనక్కి వంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే శరీర ఆకృతి సరి అవుతుంది.