Health Tips : అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే 5 మూలికల గురించి తెలుసా..!
ABN , Publish Date - Jul 19 , 2024 | 12:33 PM
40 ఏళ్లు దాటిన వారిలో ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే కాలం ఇది. రకరకాల సమస్యలతో ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టే సమయం.
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. కీణిస్తున్న ఆరోగ్యానికి సంకేతంగా మోకాళ్ల నొప్పులు, బలహీనమైన గుండె వరకూ వరుసగా ఆరోగ్య సమస్యలు వచ్చి చేరతాయి. వీటికో తోడు అధిక రక్తపోటు కూడా గుండె సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది. ఇది కాస్త నిర్లష్యం చేసినా కూడా జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. మరీ అన్నింటికీ మందులను వాడేయకుండా కొన్ని రకాల మూలికలతో ఈ అధిక రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు. అవేమిటంటే..
40 ఏళ్లు దాటిన వారిలో ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే కాలం ఇది. రకరకాల సమస్యలతో ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టే సమయం.
దీనికి చెక్ పెట్టాలంటే జీవనశైలి విధానంలో మార్పులు, ఆహారంలో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, రక్తపోటులో వచ్చే మార్పులను సమం చేస్తుంది. గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!
రక్తపోటు స్థాయిని తగ్గించే మూలికలు..
తులసి..
రక్తపోటు, జలుబు, ఫ్లూ, ఆర్థరైటిస్, ఇతర ఆరోగ్య సమస్యలకు తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆకులలోని యూజినాల్ రక్తనాళాలను సడలించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తులసి టీని తాగడం, పచ్చి తులసి ఆకులను నమలడం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఉసిరి..
జుట్టు పెరుగుదలకు ఉసిరి చక్కని పరిష్కారం. ఇది రక్త నాళాలను విస్తరించడం, అధిక రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి ఉసిరి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఉసిరి రసం ఉదయాన్నే తీసుకోవాలి.
వెల్లుల్లి..
వెల్లుల్లి గుండెకు మేలు చేస్తుంది. అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తప్రవాహాన్ని తగ్గిస్తుంది.
Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
దాల్చిన చెక్క..
దాల్చిన చెక్క భారతీయ వంటలలో ముఖ్యంగా ఉపయోగించే పదార్థం. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.
అశ్వగంధ
రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం అందించేందుకు అశ్వగంధ పనిచేస్తుంది.
అధిక రక్తపోటును తగ్గించడం సులభమేనా..
1. అధిక బరువును తగ్గించుకోవడం..
2. ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటం, హైడ్రేటెడ్ గా ఉండటం
3. పొటాషియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
4. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
Skin Health : క్లీన్ బ్యూటీ చర్మం కావాలంటే ఈ క్రీమ్స్ వాడి చూడండి..
5. చురుకుగా ఉండటం, వ్యాయామం దినచర్యలో భాగంగా చేసుకోవడం
6. క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీస్ చేయడం
7. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.
8. రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చేయాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.