Healthy Fruits: ఉదయాన్నే పరగడుపున ఈ పండ్లను తింటే చాలు.. ఇక మందులతో పనేలేదు..!
ABN , Publish Date - May 28 , 2024 | 03:58 PM
ఈ పుచ్చకాయలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడానికి సహకరిస్తుంది. ఈ పుచ్చకాయను ఉదయాన్నే తీసుకోవచ్చు.
బాగా ఆడి అలిసిపోయినా, కాస్త జ్వరం వచ్చినా, నీరసంగా ఉన్నా పండ్లరసాలు, పండ్లు తీసుకుంటూనే ఉంటాం. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ పండ్లను ఖాళీ కడుపుతో ఉదయాన్నే తింటే ఏదైనా అదనపు ప్రయోజనాలుంటాయి. మన ఆహారంలో పండ్లు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం మామూలుగా అలవాటు చేసుకోవచ్చు కానీ మనలో కొన్ని భయాలు అలాగే ఉండిపోయాయి. సరైన సమయంలో పండ్లను తీసుకోకపోతే సరిగా జీర్ణంకావనే నమ్మకాలు మనలో పాతుకుపోయాయి. ఏ పండ్లను పరగడుపునే తీసుకోవచ్చు అనేది కనుక్కుందాం.
పుచ్చకాయ..
పుచ్చకాయ జ్యూసీగా నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే పండు. ఇది 92 శాతం నీరు కలిగి ఉంటుంది. ఈ పుచ్చకాయలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడానికి సహకరిస్తుంది. ఈ పుచ్చకాయను ఉదయాన్నే తీసుకోవచ్చు.
బొప్పాయి..
బొప్పాయి అనేక పోషకాలు నిండి ఉన్న పండు. ఇది తక్కువ కేలరీలు, పీచు పదార్థాలతో ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఎ కూడా ఉన్నాయి. అలాగే అధిక బరువుతో ఉన్నవారికి బరువుతగ్గేందుకు మంచి సపోర్ట్ ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
పైనాపిల్..
విటమిన్ సి, మాంగనీస్ ఎక్కువగా ఉన్న పండు పైనాపిల్. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఎముక ఆరోగ్యానికి మంచిది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
Symptoms Of Typhoid: టైఫాయిడ్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..
యాపిల్..
రోజుకు ఒక యాపిల్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సహకరిస్తుంి. ఆకలి బాధ ఉండదు. ఇందులో క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.
కివి..
విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లతో నిండిన కివి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.