Share News

Lungs Health: ఈ 8 చిట్కాలు పాటించండి చాలు.. ఊపిరితిత్తులు బలంగా మారతాయి..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:33 PM

ఊపిరితిత్తులు మానవ శరీరంలో ప్రధాన అవయవాలు. ఇవి గుండెకు ఇరువైపులా ఉంటాయి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ను గ్రహించి, దాన్ని రక్తప్రవాహంలోకి పంపి కార్బన్ డై ఆక్సైడ్‌ను తిరిగి బయటకు పంపడం ఊపిరితిత్తుల పని...

Lungs Health: ఈ 8 చిట్కాలు పాటించండి చాలు.. ఊపిరితిత్తులు బలంగా మారతాయి..!

ఊపిరితిత్తులు మానవ శరీరంలో ప్రధాన అవయవాలు. ఇవి గుండెకు ఇరువైపులా ఉంటాయి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ను గ్రహించి, దాన్ని రక్తప్రవాహంలోకి పంపి కార్బన్ డై ఆక్సైడ్‌ను తిరిగి బయటకు పంపడం ఊపిరితిత్తుల పని. ఊపిరితిత్తులు బలంగా ఉంటే ఈ ప్రక్రియ సజావుగా సాగుతుంది. అదే ఊపిరితిత్తులు బలంగా లేకపోతే శరీరంలో ఆక్సిజన్ సరఫరా మందగిస్తుంది. వాతావరణ కాలుష్యం నుంచి జీవనశైలి, వివిధ రకాల అనారోగ్యాలు మొదలైనవి ఊపిరితిత్తులు బలహీనంగా మారేలా చేస్తాయి. ఊపిరితిత్తులు బలంగా ఉండాలంటే ఈ కింది 8 చిట్కాలు ఫాలో అవ్వాలి..


ఆ చిట్కాలు ఇవే..

  • రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుంటే ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. శారీరక శ్రమ శ్వాస క్రియను మెరుగ్గా ఉంచుతుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. శ్వాస కండరాలు, శ్వాస నాళాలు బలంగా మారుస్తుంది.

  • ప్రత్యక్ష ధూమపానమే కాదు.. పరోక్ష ధూమపానం కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. కాబట్టి ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే ధూమపానం మానేయాలి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండాలి.

  • ఇంట్లో వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి. గాలిని శుద్ది చేసే మొక్కలను పెంచాలి. ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం, దుర్గంధం లేకుండా జాగ్రత్త పడాలి.

  • లోతైన శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తులకు దివ్య ఔషధం లాంటివి. రోజూ శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేస్తుంటే ఊపిరితిత్తులు బలంగా మారతాయి.

  • తీసుకునే ఆహారం కూడా ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు సమృద్దిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకుంటే ఊపిపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

  • ఊపిరితిత్తులు బలహీనం అవ్వడానికి వాయు కాలుష్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తులు బలంగా ఉంచుకోవడానికి గాలి కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నం చెయ్యాలి. గాలి కాలుష్యానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఇన్ఫ్లుఎంజా, న్యూమెనియా వంటి జబ్బులకు ముందుగానే టీకాలు వేయించుకోవాలి. దీని వల్ల ఊపిరితిత్తుల కణజాలానికి హాని కలిగించే ఇన్ఫెక్షన్ల నుంచి ఊపిరితిత్తులను రక్షించుకోవచ్చు.

  • అధిక బరువు లేదా ఊబకాయం శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే బరువు నియంత్రణ పాటించాలి.

Updated Date - Jul 16 , 2024 | 03:33 PM