Summer Drinks : వేసవి తాపాన్ని అధిగమించడానికి వీటితో చేసే షర్భత్ తాగితే చాలు..!
ABN , Publish Date - May 14 , 2024 | 04:31 PM
చాలా భారతీయ ఇళ్ళల్లో ఈ సాంప్రదాయ పానీయాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిని తయారు చేసుకోవడం రాకో సమయం లేకనో వాటిని పక్కన పెట్టేసి, కెమికల్స్ తో తయారయ్యే ఆధునిక పానీయాలనే తీసుకుంటున్నారు. కానీ ఈ సాంప్రదాయ షర్బర్ లతో ఎంత ఉపయోగమంటే..
వేసవి వేడిని తట్టుకోవడానికి మనకున్న మార్గమల్లా.. చల్లని పానీయాలు మాత్రమే. వీటిని తాగడం వల్ల శరీరం ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతుంది. వేసవి వచ్చిందంటే ఎండల సంగతి చెప్పక్కరలెద్దు. శీతల పానీయాలలో మనకు ఇష్టమైన తాగేస్తూ ఉంటాం. అయితే ఈ లిస్ట్ లో గోండు, కటిర, సత్తు, బియ్యం నీరు వీటిని ఎందుకు ప్రయత్నించకూడదనే ఆలోచన వచ్చింది మీకు. లేకుంటే చాలా నష్టపోతారు అయితే.. వీటిని గురించి తెలుసుకుందాం.
చాలా భారతీయ ఇళ్ళల్లో ఈ సాంప్రదాయ పానీయాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిని తయారు చేసుకోవడం రాకో సమయం లేకనో వాటిని పక్కన పెట్టేసి, కెమికల్స్ తో తయారయ్యే ఆధునిక పానీయాలనే తీసుకుంటున్నారు. కానీ ఈ సాంప్రదాయ షర్బర్ లతో ఎంత ఉపయోగమంటే..
గోండ్ కతీరా షెర్భత్
గోండ్ కతీరా షెర్భత్, ట్రాగాకాంత్ గమ్ అని పిలుస్తారు. ఇది ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు మంచిది. ఈ షెర్బత్ అనేక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందినది. వేసవి పానీయంగా చాలా వరకూ వేడిని కంట్రోల్ చేస్తుంది.
Health Tips : స్మూతీస్లో అరటిపండు ఉపయోగించకపోవడానికి కారణాలేంటి..
సత్తు కా షర్బత్..
సత్తు, కాల్చిన శనగల పిండితో దీనిని తయారు చేస్తారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా వేసవిలో ప్రసిద్ధ పదార్థం. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ప్రసిద్ద పదార్థం ఇది. ఇందులోని ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహయపడుతుంది.
రైస్ వాటర్ కొబ్బరి కూలర్..
రైస్ వాటర్, అన్నం వంచిన నీరు ఇందులో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో ద్రవాలను నింపడంలో ఇది సహకరిస్తుంది. అన్నం వంచిన గంజిని రాత్రి మిగిలిన అన్నంలో కలిపి ఉదయాన్నే తీసుకుంటారు. దీనిని తినడం వల్ల బలం కలుగుతుందని భారతీయులు దీనినే అల్పాహారంగా తీసుకుంటారు.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.