Share News

Hair Fall : హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టాలంటే అలోవెరా వాడాల్సిందే..!

ABN , Publish Date - Jun 20 , 2024 | 04:54 PM

ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న కలబంద జుట్టుకు మంచి ఎఫెక్టివ్ రెమెడీలా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, జింక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెఫ్టిక్ గుణాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల గుణాలు కొల్లాజెన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

Hair Fall : హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టాలంటే అలోవెరా వాడాల్సిందే..!
Hair Growth

జుట్టు ఒత్తుగా, పొడవుగా, బలంగా ఉంటేనే అందం. అంత పొడవైన జుట్టూ బలహీనంగా రాలిపోతుంటే చాలా బాధేస్తుంది. కాస్త చిన్న చిన్న సమస్యలతో జుట్టురాలితే ( Hair Fall )వారం లోపు సర్దుకుంటుందని లైట్ తీసుకుంటాం. కానీ స్త్రీకి డుట్టే అందం. జుట్టు రాలిపోతుందని తెగ బెంగ పడిపోతాం.

మన జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగానే జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న సమస్య. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, సరైన జీవన శైలి అలవాట్లు లేకపోవడం, సరైన నిద్రా సమయాలు లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణాలు. అయితే ఆయుర్వేదంలో కూడా ప్రభావవంతమైన పరిష్కారాలున్నాయి. వాటిలో జుట్టు సమస్యకు కలబంద ప్రముఖంగా పనిచేస్తుంది. అదెలాగంటే..

కలబంద..

ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న కలబంద జుట్టుకు మంచి ఎఫెక్టివ్ రెమెడీలా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, జింక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెఫ్టిక్ గుణాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల గుణాలు కొల్లాజెన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!

దురద నుంచి ఉపశమనం.. స్కాల్ప్ చర్మం పొరలుగా, ఎర్రగా మారినపుడు దురద ఎక్కువగా ఉంటుంది. దీనికి అలోవెరా జెల్ మంతి ఉపశమనం కలిగిస్తుంది.

చుండ్రు.. చుండ్రు సమస్య అంత త్వరగా వదిలే సమస్య కాదు. చుండ్రు దురదను కూడా కలిగిస్తుంది. కలబంద జ్యూస్ ను తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య ఉండదు.

Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!

జుట్టు మూలాలు.. జుట్టు మూలాలు బలంగా మారుతాయి. కలబంద రసాన్ని రోజూ రాస్తూ ఉంటే మూలాలు బలంగా దృఢంగా మారతాయి.

జుట్టు రాలడం... ఈ సమస్య చాలా ఒత్తిడిని,. నిరాశను కలిగిస్తుంది. దీనికి కలబంద రసాన్ని అఫ్లయ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 20 , 2024 | 04:54 PM