Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:38 PM
వంటగదిలో అనేక మూలికలు, మసాలాలు మన శరీరంలో ఆరోగ్యానికి దోహదపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గేందుకు ఈ చిట్కాలు సహకరిస్తాయి. బరువు తగ్గేందుకు, జీవక్రియకు, నిద్ర నాణ్యతకు కూడా ఈ గింజలు, మసాలాలు సహాకరిస్తాయి.
ఇప్పటి రోజుల్లో బరువు పెరగడం సులువే కానీ తగ్గడం విషయానికి వస్తే చాలా కష్టంతో కూడుకున్న పని. అంత సులువుగా పెరిగిన బరువును వదిలించుకోలేం. అయితే బరువు తగ్గడానికి మనం తీసుకునే జీవినశైలి అలవాట్లో చాలావరకూ సపోర్ట్ చేస్తాయి. సరైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, అలాగే వేళకు నిద్ర పోవడం కూడా మంచి రిజల్ట్ ఇస్తాయి. దీనికి తోడు కాస్త బరువుతగ్గించే పదార్థాల వైపు కూడా దృష్టిపెడుతూ ఉండాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలను, పద్దతుల ద్వారా బరువును ఇట్టే తగ్గవచ్చు. అవేమిటంటే..
వంటగదిలో అనేక మూలికలు, మసాలాలు మన శరీరంలో ఆరోగ్యానికి దోహదపడతాయి. ముఖ్యంగా బరువు (lose weight) తగ్గేందుకు ఈ చిట్కాలు సహకరిస్తాయి. బరువు తగ్గేందుకు, జీవక్రియకు, నిద్ర నాణ్యతకు కూడా ఈ గింజలు, మసాలాలు సహాకరిస్తాయి.
వాటిలో..
జీవిక్రియను పెంచే వాటిలో కొన్ని క్యారమ్ గింజలు, సోపు గింజలు, ఏలకులు, లవంగాలు, అల్లం, మిరియాలు, సోంపు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పుదీనా, తులసి, నిమ్మకాయ వంటివి మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన మేలు చేస్తాయి.
Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
ఉబ్బరం, అజీర్ణం, బరువు పెరగడం, నిద్రలేమి సమస్యకు చెక్ పెడతాయి. ఈ పొడులను రోజుకు మూడు సార్లు గ్లాసు నీటిలో తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచిది. ఈ పొడులను సీసాలో రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
ఆయుర్వేదంలో(Ayurvedic) జీలకర్ర జీవక్రియను పెంచుతాయని చెప్పబడింది. జీవక్రియను మెరుగుపరుచుకునేందుకు ఉబ్బారాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది మంచి ఎంపిక. గింజలు, విత్తనాలతో శరీరంలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. సాధారణకు అంతరాయం కలిగించేవి కాకుండా సపోర్ట్ చేసే ఆహారాలను ఎంచుకుంటూ ఉఓండాలి. ఫ్రీ రాడికల్స్ అలసటతో పోరాడేందుకు, మొత్తం శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి ఇవి సహకరిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. ఇవి పొట్టను కరింగించడంలో సహకరిస్తాయి. కొవ్వు కూడా కరుగుతుంది.
కేలరీలను బర్న్ చేయడానికి చిట్కాలు పనిచేస్తాయి. అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. వీటితో పాటు మంచి ఆహారం కూడా అవసరం. అలాగే రోజులో కొంత సమయం తప్పక వ్యాయామం ఉండాలి. ఇవి మిమ్మల్ని అధిక బరువు నుంచి రక్షిస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.