The Heat Wave : వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ.. ఈ టైంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏవి?
ABN , Publish Date - May 04 , 2024 | 04:39 PM
వాతారవణంలో వేడి పెరిగే కొద్దీ ఇబ్బందిగా మారుతుంది. వేడి గాలులు చాలా వరకూ ఇబ్బంది పెడతాయి. హీట్ వేవ్ కారణంగా అనేక సమస్యలు శరీరంలో పెరుగుతూ ఉంటాయి. వేడికి తట్టుకోలేని వారు, ఎండలో పనిచేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వాతారవణంలో వేడి పెరిగే కొద్దీ ఇబ్బందిగా మారుతుంది. వేడి గాలులు చాలా వరకూ ఇబ్బంది పెడతాయి. హీట్ వేవ్ కారణంగా అనేక సమస్యలు శరీరంలో పెరుగుతూ ఉంటాయి. వేడికి తట్టుకోలేని వారు, ఎండలో పనిచేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భారత దేశంలోని అనేక ప్రాంతాలను తాకుతుందని ఓ అంచనా.. ఈ హీట్ వేవ్ ని తట్టుకోవాలంటే కొన్ని అవసరమైన ఆహార చిట్కాలు ఇవే..
ఈ కాలంలో ప్రతి ఒక్కరూ చేయాల్సింది..
హీట్ వేవ్ శరీరంలో డీహైడ్రేషన్‌ను కలిగిస్తుంది. అందువల్ల దాహం అనిపించకపోయినా నీటిని తాగుతూ ఉండాలి.
1. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్ళకూడదు.
2. నీటిని తరచుగా తాగుతూ ఉండాలి.
3. హీట్ వేన్ సమయంలో తేలికైన దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు అయితే మంచిది. అవి చెమటను పీల్చుకుంటాయి.
Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!
4. బయట ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనైటేడ్ శీతల పానీయాలు తీసుకోవాలి.
5. అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలను తీసుకోకూడదు.
6. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లల్ని వదిలి వెళ్లకూడదు.
7. ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటి పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.
8. పెంపుడు జంతువులను నీడలో ఉంచాలి.
9. రాత్రి సమయంలో కిటికీలను తెరిచి ఉంచాలి.
10. చల్లని నీటితో రాత్రి పూట స్నానం చేయడం మంచిది.
Sugarcane juice : చెరుకు రసాన్ని రెండు నిమిషాల్లో ఇంట్లోనే ఎలా చేయచ్చో తెలుసా..!
సీజనల్ ఫ్రూట్స్..
ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ప్రోత్సహించడానికి ప్రేగు సమస్యలను తగ్గించేందుకు వేసవిలో ఈ కాలానికి సంబంధించిన పండ్లును, తాజాకూరలను తీసుకోవడం మంచిది.
తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి.
వేడి గాలులు, వేడి వాతావరణంలో అలసట ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ సమస్యకు మంచి ఆహారాన్ని తేలిక పాటి ఆహారాలను తీసుకోవాలి.
ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవడం మరీ మంచిది. శరీరంలో ఎనర్జీ పెంచుతాయి.
తాజాగా ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. ఇది అనేక వ్యాధులకు పరిక్షారం కలిగిస్తుంది. ఇతర వ్యాధులు రాకుండా చేయాలంటే తాజా కూరలు, పండ్లు
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.