Share News

Dengue fever : డెంగ్యూ జ్వరం కారణంగా మెదడు మీద కూడా ప్రభావం ఉంటుందా..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 12:52 PM

ఎన్సెఫలోపతి దీని కారణంగా మెదడు పనితీరులో ఇబ్బందులు, కాలేయ ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటాయి. రోగులలో మానసిక స్థితి సరిగా ఉండకపోవడం, గందరగోళం, మూర్చ, కోమా లోకి వెళ్లడం వంటివి ఉంటాయి.

Dengue fever : డెంగ్యూ జ్వరం కారణంగా మెదడు మీద కూడా ప్రభావం ఉంటుందా..!
Dengue fever

డెంగ్యూ జ్వరం వచ్చిందంటే కోలుకోవడం చాలా వరకూ సమయం తీసుకుంటుంది. శరీరం అలసట, విపరీతమైన కండరాల నొప్పులు ఉంటాయి. ఇవన్నీ మన ఇంటి వాతావరణంలో, పరిసరాల్లో ఉండే దోమల కారణంగా, జ్వరంతో వచ్చే ఇబ్బందులు. డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తుల్లో ముఖ్యంగా అధిక జ్వరంతోపాటు, డెంగ్యూ వైరస్ వల్ల కలిగే దోమల ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ ఫెక్షన్. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల నొప్పి, కీళ్లు కండరాల నొప్పి, దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం ఉంటాయి. ఈ జ్వరం నాడీ సంబంధిత సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది.

డెంగ్యూ జ్వరంలో కారణంగా నాడీ సంబంధిత సమస్యలు ఎన్ఫెఫలోపతి, ఎన్సెఫాలిటిస్, గులియన్ బారే సిండ్రోమ్, మైలిటిస్, పెరిఫెరల్ న్యూరోపతి వంటివి ఉన్నాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలి, విశ్రాంతి, మందులు సరిగా వాడటం వంటివి డెంగ్యూ జ్వరం తర్వాత వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి. అయితే డెంగ్యూ జ్వరంలో ముఖ్యాంగా నాడీ సంబంధిత సమస్యల విషయంలో అవగాహన అవసరం.

నరాల సమస్యలు..

ఎన్సెఫలోపతి దీనికారణంగా మెదడు పనితీరులో ఇబ్బందులు, కాలేయ ఇబ్బందులు వంటి సమస్యలు ఉంటాయి. రోగులలో మానసిక స్థితి సరిగా ఉండకపోవడం, గందరగోళం, మూర్చ, కోమాలోకి వెళ్లడం వంటివి ఉంటాయి. ఎన్సెఫాలిటిస్ లక్షణాల్లో జ్వరం, తీవ్రమైన తలనొప్పి, మెడ గట్టిపడటం, స్పృహలో ఉండకపోవడం వంటివి సరాల సంబంధిత లోపాలు ఉంటాయి.

Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!


Guillain Barre సిండ్రోమ్ అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్, రోగనిరోధక వ్యవస్థ మరాలపై దాడి చేస్తుంది. ఇది డెంగ్యూ సంక్రమణతో ముడిపడి ఉంటుంది. GBS వల్ల కండరాల బలహీనత, పక్షవాతం శ్వాసకోశ వైఫల్యానికి కారణమవుతుంది. మైలిటిస్, వెన్నుపాము వెలుపలి నరాలను ప్రభావితం చేస్తుంది. ఇది నరాల వ్యాధి. జలదరింపు, తిమ్మిరి, కండరాల బలహీనతకు కారణం అవుతుంది. జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

డైంగ్యూ వైరస్ ఈ నాడీ సంబంధిత సమస్యలకు వైరల్ దాడి జరుగుతుంది. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వల్ల ముందస్తుగా గుర్తించడం వల్ల ఈ డెంగ్యూ జ్వరాన్ని నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 16 , 2024 | 12:52 PM