Health Benefits : పెరుగును ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. గుండెకు కూడా మంచి బలమట..
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:05 PM
పెరుగులో ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో సమర్థవంతంగా పోరాడుతుంది.
మంచి భోజనం చేయడం అంటే కడుపునిండా తినడం మాత్రమే కాదు. తినే పదార్థాలన్నీ ఎన్ని తిన్నా భోజనంలో కమ్మని పెరుగు లేకపోతే భోజనం పూర్తయినట్టు కాదు. మనం తినే పదార్థాలు ఎంత కమ్మగా ఉన్నా కూడా పెరుగు తప్పక ఉండాల్సిందే. అయితే పెరుగు ప్రోబయోటిక్స్ తో నిండి ఉంటుంది. రోజూ పెరుగును ముఖ్యంగా భోజనం తర్వాత తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు అందుతాయి. జీర్ణ క్రియకు సహాయం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి ఎముక ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా పెరుగు పెంచుతుంది. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.
జీర్ణక్రియలో..
పెరుగులో ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో సమర్థవంతంగా పోరాడుతుంది.
ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
పెరుగు పుష్కలంగా కాల్షియం, విటమిన్ డి మూలం. బలమైన ఎముకలు, దంతాలకు అవసరం. రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల బోలు ఎముక వ్యాధి రుగ్మతను తగ్గిస్తుంది.
Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
గుండె ఆరోగ్యం.
పెరుగులో ప్రయోజనమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను HDL పెంచి, చెడు కొలెస్ట్రాల్ LDL తగ్గించడంలో సహకరిస్తుంది.
Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
చర్మ ఆరోగ్యానికి కూడా..
పెరుగు తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ ఇ, డింక్ వంటివి మంటను తగ్గించడంలో సహకరిస్తుంది. బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.
ఆహారంలో పెరుగును ఎలా చేర్చుకోవాలి.
పెరుగును తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన డెజర్ట్ కోసం పండ్లు, తేనెతో పాటు పెరుగును కూడా కలిపి తీసుకోవచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.