Share News

Heart Health : రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:25 PM

రక్తంలో అధిక ఇనుము ఉంటే హెమోక్రోమాటోసిస్ అని పిలుస్తారు. ఇది కాలేయం, గుండె వంటి అవయవాలకు హాని కలిగిస్తుంది. రక్తదానం ఈ ఇనుము నిల్వలను తగ్గించడంలో సహకరిస్తుంది. ఐరన్ ఓవర్ లోడ్ కు దారితీసే పరిస్థితులను దాటేందుకు ఉపయోగపడుతుంది.

Heart Health : రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!
Heart Health

రక్తదానం చాలా గొప్ప దానాల్లో ఇదీ ఒకటి. ప్రాణాపాయంలో ఉన్న ఎందరికో రక్త దానంతో ప్రాణ దానం చేయవచ్చు. రక్తదానం అంటే చాలామంది భయపడుతుంటారు. దీనివల్ల నొప్పి కలుగుతుందని, రక్తం ఇవ్వడం వల్ల అలసట, నీరసం ఆరోగ్యం పాడవుతుందనే వారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ అలా ఉండరు.. రక్త దానాన్ని చాలా గొప్ప విషయంగా తీసుకుని క్రమం తప్పకుండా రక్త దాతలు కూడా ఉంటారు. ఇలా రక్తాన్ని దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. దీని వల్ల ఇంకా..

దీనివల్ల ప్రయోజనాలు..

రెగ్యులర్ రక్తదానం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది రక్తదానం చేయడం వల్ల రక్తం చిక్కదనం పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇనుము నిల్వలు..

రక్తంలో అధిక ఇనుము ఉంటే హెమోక్రోమాటోసిస్ అని పిలుస్తారు. ఇది కాలేయం, గుండె వంటి అవయవాలకు హాని కలిగిస్తుంది. రక్తదానం ఈ ఇనుము నిల్వలను తగ్గించడంలో సహకరిస్తుంది. ఐరన్ ఓవర్ లోడ్ కు దారితీసే పరిస్థితులను దాటేందుకు ఉపయోగపడుతుంది.


Mango seeds : మామిడి కాయలు తిని టెంకలు పారేస్తున్నారా? వీటితో ఎన్ని లాభాలో తెలుసా..!

కొత్త రక్త కణాల ఉత్పత్తి

రక్తదానం చేసినప్పుడు శరీరం రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి పని చేస్తుంది. కొత్త రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

హెల్త్ స్క్రీనింగ్..

రక్తదానం చేసే ముందు దాతలు పల్స్, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్ స్తాయిలు చెక్ చేస్తారు. ఇది ప్రాథమిక ఆరోగ్య పరీక్ష కావడం వల్ల ఆరోగ్య స్థితిని గురించి తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది.

మానసిక హెల్త్..

రక్తదానం చేయడం శరీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా లాభాన్నిస్తుంది. ఈ దానం ప్రాణాన్ని కాపాడడమే కాకుండా ఆరోగ్యం గురించి తెలుసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 13 , 2024 | 04:25 PM