Share News

Health Benefits : ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:39 AM

ఉపవాసం మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి, ఆరోజు కేవలం నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.

Health Benefits : ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!
Health Benefits

అతిగా తింటే ఇబ్బందులు తప్పవు. మితమైన ఆహారం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచే చేస్తుంది. అయితే ఆరోగ్యంతో ఉండాలంటే ఈ మధ్య కాలంలో వస్తున్న మరో డైట్ ఏమీ తినకుండా రోజంతా నీరు తాగి మాత్రమే ఉపవాసంతో ఉండటం. ఈ ఉపవాసం అనేది అనేక సంస్కృతులు, మతాలలో ప్రధానమైన ఆచారంగా వస్తుంది. పెద్ద పండుగలు, పూజలు, పర్వదినాల్లో ఉపవాసం ఉండటం మామూలుగా జరిగేదే. ఉపవాసం అంటే కొన్ని రోజులలో కొన్ని రకాల ఆహారాన్ని మాత్రమే తినడం, కొంత సమయం పాటు ఆహారాన్ని మానుకోవడం ఇదే ఉపవాసం. ఉపవాసం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుందని, ఆయుష్షును పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. ఉపవాసం ఉపయోగాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

ఉపవాసం జీవక్రియ రేటును నెమ్మదించేలా చేస్తుంది. అందుకే సరైన పద్దతిలో ఉపవాసం చేస్తే గొప్ప ప్రయోజనాన్ని పొందవచ్చు. బాగా ఆకలి వేస్తుంటే అందినంత జంక్ ఫుడ్ తినేయకుండా కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరమైన పద్దతి. పూజలు, ప్రత్యేక దినాల్లోనే కాకుండా కడుపు నిండుగా ఉన్న ప్రతిసారీ మరో పూట తినకపోవడమే మంచిది. కడుపును ఎంత ఖాళీగా ఉంచితే అంత ఆరోగ్యం. మితంగా తినమని చెప్పడమే ఉపవాసం ముఖ్య ఉద్దేశ్యం.

1. ఉపవాసం బరువును తగ్గిస్తుంది.

2. రక్తప్రవాహంలోకి కీటోన్‌లను విడుదల చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

3. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

4. ఉపవాసం వ్యాధిని నిరోధించే కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది.

5. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

6. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

7. ఉపవాసం బరువు తగ్గడానికి, శరీర కొవ్వు తగ్గించడంలో సహకరిస్తుంది. అప్పుడప్పుడూ ఉపవాసం చేయండం వల్ల అనేక మంచి ఫలితాలను పొందవచ్చు.


Healthy Foods : నానబెట్టిన బాదం, వేరుశెనగలో ఏది ఆరోగ్యానికి మంచిది ?

ఉపవాసాల్లో రకాలు..

అప్పుడప్పుడూ ఉపవాసం.. ఇది 16/8 పద్దతి దీనితో గుండె ఆరోగ్యం పెరుగుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

నీటి ఉపవాసం.. దీనిలో నీరు మాత్రమే తీసుకుంటూ ఉంటారు.

పాక్షిక ఉపవాసం.. ఇందులో ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, కెఫీన్ పానీయాలు, రెగ్యులర్ డైట్ నుంచి తొలగిస్తారు.

క్యాలరీ పరిమితి.. నిర్దిష్ట కాలం ఉపవాసం ఉండకుండా రోజువారీగా మొత్తం క్యాలరీలను తీసుకోవడాన్ని తగ్గించడం.

జ్యూస్ ఫాస్టింగ్.. ఇందులో పండ్లు, కూరగాయల రసాలను మాత్రమే తీసుకోవడం.


Health Tips : వానాకాలంలో జలుబు, దగ్గుకు లవంగాలతో చెక్ పెట్టేదెలా..!

ఉపవాసం మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి, ఆరోజు కేవలం నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయట. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి కొంత సమయం పాటు ఆహారం లేకపోవడంతో, శక్తిని ఆదా చేయడానికి, రోగనిరోధక కణాలను రీసైకిల్ చేయడానికి సహకరిస్తుంది. ఉపవాసం గుండె జబ్బులకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. అయితే ఉపవాసం అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలికి అనుగుణంగా ఉపవాస పద్దతిని ఎంచుకోవడం మంచిది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 06 , 2024 | 12:24 PM