Share News

Healthy Foods : పాలు కాకుండా కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసా.. వీటితో..!

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:02 PM

చియా గింజలు, బాదం, సోయా పాలు ఆరోగ్యానికి కాల్షియం అవసరం. 19 నుంచి 50 ఏళ్ళ వయస్సు ఉన్న చాలా మందిలో 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. పాలు జున్ను, పెరుగు కాల్షియం ఉత్తమ వనరులు, కానీ అనేక నాన్ డైరీ ఆహారాలలో కూడా ఇది పుష్కలంగా ఉంటుంది. చియా సీడ్స్ లో కాల్షియం బాగా ఉంటుంది. చియా గింజలు మెగ్నీషియంతో సహా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఇందులో ఉన్నాయి.

Healthy Foods : పాలు కాకుండా కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసా.. వీటితో..!
foods to eat daily

కాల్షియం పుష్కలంగా ఉండే వివిధ రకాల ఆహారాలున్నాయి. చాలామంది పాలలో, శాకాహారంలో కాల్షియం వెతుకుతారు. ఎందులో ఇది సరిగా ఉంటుందో తెలుసుకుందాం. కాల్షియం అనేది పాల ఉత్పత్తులలో, ముదురు ఆకుపచ్చ ఆకు కూరల్లో, చిక్కుళ్లలో బలవర్థకమైన ఆహారంగా ఉంటుంది. ఇది శరీరానికి బలవర్థకమైన పోషకం కూడా. శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ఖనిజం కూడా ఇదే. 99శాతం కాల్షియం ఎముకలు, దంతాల్లో మాత్రమే ఉంటుంది. అయితే కాల్షియం ఇంకా ఉండేది హార్మోన్లు, కండరాలు, నరాల ఆరోగ్యానికి కూడా ఇది ముఖ్యమే.

వయసుతోపాటు కాల్షియం స్థాయిలు మన శరీరంలో ఆహారంతో పాటు అందడం అనేది తగ్గుతూ ఉంటుంది. శరీరంలో అత్యంత సమృద్ధిగా కాల్షియంను తీసుకోలేదు. ఇది ఇతర సప్లిమెంట్స్ సహాయంతో భర్తీ చేయాల్సి ఉంటుంది. కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రెట్ కాల్షియం సప్లిమెంట్లలో కార్బోనేట్ కాల్షియం సిట్రేట్ ఉన్నాయి.

కాల్షియం ఆరోగ్య ప్రయోజనాలు..

ఎముకలలో దంతాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

శరీరానికి బలాన్ని ఇస్తుంది.

కండరాల కదలికలో సహాయం చేస్తుంది.

మెదడు శరీర వ్యవస్థల సంకోచించడం రక్త ప్రవాహానికి సహాయపడుతుంది.

Health Benefits: కాల్షియం, విటమిన్ డి క్యాప్సూల్స్ వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

నాళాలు సడలించడం, సంకోచించడం వల్ల రక్త ప్రవాహానికి సహాయపడుతుంది.

శరీరం పనితీరుకు మద్దతు ఇచ్చే హార్మోన్ల ఎంజైమ్ లను విడుదలకు సహకరిస్తుంది.

చియా గింజలు, బాదం, సోయా పాలు ఆరోగ్యానికి కాల్షియం అవసరం. 19 నుంచి 50 ఏళ్ళ వయస్సు ఉన్న చాలా మందిలో 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది.

పాలు జున్ను, పెరుగు కాల్షియం ఉత్తమ వనరులు, కానీ అనేక నాన్ డైరీ ఆహారాలలో కూడా ఇది పుష్కలంగా ఉంటుంది. చియా సీడ్స్ లో కాల్షియం బాగా ఉంటుంది. చియా గింజలు మెగ్నీషియంతో సహా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఇందులో ఉన్నాయి. సోయా పాలలో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సోయాబీన్స్ నుండి తయారైన మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయం, పాల అలెర్జీలు, లాక్టోస్ అసహనం ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. కాల్షియం, ప్రధాన పదార్థంగా ఉన్న సోయా పాలు 3 నుంచి 5 గ్రాముల కాల్షియం కలిగి ఉంటుంది. ఎముకలను రక్షించేందుకు, శరీర ప్రక్రియలకు మద్దతు ఇచ్చేందుకు సోయా పాలు కాల్షియం అధికంగా కలిగి ఉన్నాయి.


Overall Health : ప్రతి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..!

అత్తి పండ్లు కాల్షియం కలిగి ఉంటాయి. ఇందులో 1.21 గ్రాముల కాల్షియం ఉంటుంది.

టోపు ఇది ప్రోటీన్, కాల్షియం కలిగి ఉంటుంది. సోయాబీన్స్ నుంచి తయారైన ఆహారం ఇది. అరకప్పు టోపులో 1.2 నుంచి 4 గ్రాముల వరకూ కాల్షియం ఉంటుంది.

వైట్ బీన్స్.. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నాన్ డైరీ పదార్థాలు. ఇందులో వైట్ బీన్స్ అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది.

బ్రోకలీ.. క్యాబేజీ రకానికి చెందిన, కాలీఫ్లవర్ ఆకారంలో ఉంజే బ్రోకలీ ఎనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది లాక్టోస్ లేని మొక్కల ఆధారిత పదార్థం.

ఎడమామె.. ఎడమామె అనేది సోయాబీన్ ఇది పక్వానికి రాకముందే తింటారు. ఎడమామె అనేది కాల్షియం పెంచుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 10 , 2024 | 05:06 PM