Share News

Water in Health : రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగడంవల్ల నిద్ర పడుతుందా.. దీని వల్ల ప్రయోజనాలేంటి?

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:41 PM

నిద్రవేళకు ముందు వేడినీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది. రాత్రి పూట వేడిీ నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సపోర్ట్ చేస్తుంది.

Water in Health : రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగడంవల్ల నిద్ర పడుతుందా.. దీని వల్ల ప్రయోజనాలేంటి?
Water in Health

నీటిని ఎంత తీసుకుంటే అంత శరీరానికి లాభం చేకూరుతుంది. నీటితో చాలా వరకూ డీహైడ్రేషన్ తగ్గి ఆరోగ్యం బావుంటుంది. అదే గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తీసుకునేవారు కూడా చాలామందే ఉంటారు. ఇదే నీటిని రాత్రి పడుకునే సమయానికి గంట ముందు కనుక తీసుకోగలిగితే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. బాగా దాహంగా ఉన్నప్పుడు నీటిని తాగితే శరీరంలో హాయిగా ఉంటుంది. దాహం తీరుతుంది. కాస్త కూల్ వాటర్ తీసుకుంటే ఇంకాస్త తృప్తిగా అనిపిస్తుంది. అయితే గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు అందుతాయి. అదీ రాత్రి పడుకునే సమయంలో గోరువెచ్చని నీటిని తాగితే నిద్ర బాగా పడుతుందట. ఇంకా దీనితో కలిగే ప్రయోజనాలేంటంటే..

నిద్రవేళకు ముందు వేడినీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది. రాత్రి పూట వేడిీ నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సపోర్ట్ చేస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను వేడి నీరు క్లియర్ చేస్తుంది. గొంతు నొప్పి సమస్య కూడా తగ్గుతుంది. రాత్రంతా హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్య ఉండదు.


Health Tips : మహిళల ఆరోగ్యంలో ముఖ్యంగా పిరియడ్స్ సమస్యల నుంచి రిలీఫ్ ఇచ్చే ఈ మసాలా గురించి తెలుసా..!

గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. రాత్రి పూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఉదయాన్నే శరీరంలోని టాక్సిన్స్ ని సులభంగా బయటకు పంపుతుంది.

జీర్ణ క్రియ మెరుగవుతుంది. ఒకటి రెండు గంటల ముందు గోరువెచ్చని నీటిని తాగితే రాత్రి సమయంలో జీర్ణ సమస్యలు రావు.

కడుపు సంబంధిత సమస్యలు కూడా గోరువెచ్చని నీటితో సులభంగా నయం అవుతాయి.


Health Tips : శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మర్చేసే దీని గురించి తెలుసా.. ఒక్క స్పూన్ తింటే చాలు..!

ఒత్తిడి తగ్గుతుంది రాత్రి పూట గోరువెచ్చని నీటిని తీసుకుంటే అజీర్ణం, ఉబ్బరం సమస్యలు పోయి ఒత్తిడి కూడా దూరం అవుతుంది.

మెటబాలిజం స్థాయిలు వేగంగా పెరుదుతాయి. ఆరోగ్యంగా బరువు తగ్గుతుంది. వేడి నీరు కొవ్వును కరిగిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 19 , 2024 | 04:41 PM