Gain Weight : లంచ్ తినే సమయంలో ఈ పనులు చేస్తున్నారా? ఇలా చేస్తే బరువు పెరగడం ఖాయం..
ABN , Publish Date - Jun 22 , 2024 | 02:31 PM
బరువు ఇప్పుడు అందరిలో దాదాపుగా ఉన్న సమస్య ఇది. కాస్త నిర్లష్యంగా ఉన్నామా బరువు ఇట్టే పెరిగిపోతుంటాం. ఈ బరువు అనేది శరీరంలో ఎలా వచ్చి చేరినా వదిలించుకోవడం మాత్రం అంత సులువైన పనికాదు.
బరువు ఇప్పుడు అందరిలో దాదాపుగా ఉన్న సమస్య ఇది. కాస్త నిర్లష్యంగా ఉన్నామా బరువు ఇట్టే పెరిగిపోతుంటాం. ఈ బరువు అనేది శరీరంలో ఎలా వచ్చి చేరినా వదిలించుకోవడం మాత్రం అంత సులువైన పనికాదు. నిజానికి బరువు పెరగడం అనేది మన జీవన శైలి అలవాట్ల వల్లనే చాలా వరకూ జరుగుతుందని తెలుసా.. ముఖ్యంగా..
బరువు తగ్గడం అనేది పెద్ద పోరాటమే. చాలా ప్రయత్నాలు చేసి చివరికి విసిగిపోయిన వారు కూడా చాలామందే ఉంటారు. అయితే చాలా వరకూ మన జీవనశైలి అలవాట్లే బరువు పెరిగేందుకు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా లంచ్ టైమ్.. ఈ సమయంలో మనకున్న అలవాట్లే బరువు పెరిగేలా చేస్తాయట. మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యమైన ఆహారం తీసుకునే సమయాల్లో ఇదీ ఒకటి. ఎందుకంటే ఇది రోజు మధ్యలో పని గంటలలో శక్తిని అందించేందుకు సహాయపడే సమయం.
అల్పాహారం తర్వాత రాత్రి భోజనం కోసం శ్రద్ధ చూపిస్తారు కానీ మధ్యాహ్న భోజనం గురించి మాత్రం శ్రద్ధ చూపరు. ఇదే తప్పు వల్ల బరువు పెరిగేందుకు అవకాశం అవుతుంది.
1. ఆకలితో ఉన్నప్పుడు తింటారు.. ఆకలితో ఉన్నప్పుడు మధ్యహ్నం భోజనం ఆలస్యం చేస్తుంటారు. ఇలా జరిగినప్పుడు మామూలుగా కంటే ఎక్కువ తినేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఆకలి అనిపించగానే భోజనం తినేయాలి.
2. మధ్యాహ్నం భోజనాన్ని తినే పది నిమిషాల ముందు తినే ఆహారాన్ని ఎంచుకోకూడదు. ఇలా చేయడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునే వీలు కూడా ఎక్కువగా ఉంటుంది.
Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!
3. మధ్యాహ్న భోజనాన్ని ముందుగా ప్లాన్ చేసుకుని సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. భోజనంలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే తినే ఆహారం బరువును పెంచేస్తుంది.
4. బాగా పనిలో ఉన్నప్పుడు, ఒత్తిడితో ఉన్నప్పుడు భోజనాన్ని తినడం వల్ల అతిగా తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
yogurt face mask : ముఖానికి పెరుగు పూత మంచిదేనా.. దీనితో ఎలాంటి ఫలితాలుంటాయి..!
5. తక్కువ తినాలి. తినడానికి ఇష్టపడేవారు లేదా లంచ్ మానేస్తే బరువు పెరుగుతారు. ఇది డిన్నర్ మీద ప్రభావం చూపుతుంది. డిన్నర్ సమయంలో అతిగా తినేస్తారు.
కనుక ఈ తప్పులు జరగకుండా చూసుకుంటే బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.