yogurt face mask : ముఖానికి పెరుగు పూత మంచిదేనా.. దీనితో ఎలాంటి ఫలితాలుంటాయి..!
ABN , Publish Date - Jun 21 , 2024 | 04:38 PM
పెరుగును ముఖానికి పూయడం అనేది అందరికీ పడకపోవచ్చు. అందుకని పెరుగు పూత వేసుకునే వారు ముందుగా పరీక్షించుకుని వేసుకోవాలి. దీనితో మరీ సున్నితమైన చర్మం ఉన్నవారిలో దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖం అందంగా మెరవడానికి అనేక ఉత్పత్తులను ముఖాని పూస్తూ ఉంటాం. నిజానికి మన ఇంట్లో లభించే చాలా పదార్థాలను మనం గుర్తించి, వినియోగించేది తక్కువే. పెరుగునే తీసుకుంటే పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మంచి వేసవిలో పెరుగును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. మరి అదే పెరుగుతో ముఖానికి పూతను వేసినప్పుడు ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ ముఖానికి అందాన్ని పెంచుతుంది.
(yogurt face mask )పెరుగును ముఖానికి పూయడం అనేది అందరికీ పడకపోవచ్చు. అందుకని పెరుగు పూత వేసుకునే వారు ముందుగా పరీక్షించుకుని వేసుకోవాలి. దీనితో మరీ సున్నితమైన చర్మం ఉన్నవారిలో దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పెరుగు(yogurt)లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది.
Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
చర్మం పొడిగా, నిర్జీవంగా మారితే చర్మ సంరక్షణలో భాగంగా పెరుగును చేర్చుకోవచ్చు. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి పని చేస్తుంది. వేసవిలో చర్మానికి పెరుగును ఉపయోగిస్తే ఇది చర్మానికి తేమను తెస్తుంది. వేసవిలో ముఖంమీద వచ్చే మచ్చలు మొటిమలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.
కాస్త పెరుగు, శనగపిండి, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
అలాగే ముఖానికి దుమ్ము, ధూళి కారణంగా చిరాకుగా ఉన్న సమయాల్లో పెరుగుతో పాటు తేనెను కూడా కలిపి పూయడం వల్ల ముఖంలోని జిడ్డుదనం పోయి నిగారింపు వస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.