Share News

Health Tips: పొరపాటున కూడా వీరు బీట్‌రూట్ తినొద్దు.. ఎందుకంటే..!

ABN , Publish Date - Jan 13 , 2024 | 10:10 PM

Health Tips: వెజిటేబుల్స్‌లో బీట్‌రూట్‌ ప్రత్యేకతే వేరు. బీట్‌రూట్ తినడానికి రుచినివ్వడమే కాదు.. ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఔషధ గుణాలతో పాటు.. పోషకాలూ పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. దీనిని సూపర్ ఫుడ్స్ లిస్ట్‌లో చేర్చేశారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ తినడం వలన మధుమేహం, జ్వరం, మలబద్ధకం, జీర్ణ సంబంధిత వ్యాధులు, రక్తహీనత వంటి సమస్యలు నయం అవుతాయి.

Health Tips:  పొరపాటున కూడా వీరు బీట్‌రూట్ తినొద్దు.. ఎందుకంటే..!
Beetroot Side Effects

Health Tips: వెజిటేబుల్స్‌లో బీట్‌రూట్‌ ప్రత్యేకతే వేరు. బీట్‌రూట్ తినడానికి రుచినివ్వడమే కాదు.. ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఔషధ గుణాలతో పాటు.. పోషకాలూ పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. దీనిని సూపర్ ఫుడ్స్ లిస్ట్‌లో చేర్చేశారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ తినడం వలన మధుమేహం, జ్వరం, మలబద్ధకం, జీర్ణ సంబంధిత వ్యాధులు, రక్తహీనత వంటి సమస్యలు నయం అవుతాయి. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ బీట్‌రూట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొందరు వీటిని తినొద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి దీనిని ఎవరు తినొద్దు.. ఎందుకు తినొద్దు.. కీలక వివరాలు తెలుసుకుందాం..

ఆయుర్వేద నిప్పులు చెబుతున్న వివరాల ప్రకారం..

కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే బీట్‌రూట్ తినొద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌లో ఆక్సలేట్లు అధికంగా ఉన్నందున వీటిని తింటే ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే, తక్కువ పరిమాణంలో దీనిని తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

అధిక నైట్రేట్ కంటెంట్ కారణంగా బీట్‌రూట్ రక్తపోటును తగ్గిస్తుంది. ఒకవేళ రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ బీట్‌రూట్‌ను తినొద్దు. ఒకవేళ తింటే.. బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది.

అలెర్జీ సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తినొద్దు. లేదంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా బీట్‌రూట్ తినొద్దు. వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మరి ఎలా తినొచ్చు..

బీట్‌రూట్‌ను ఒకవేళ తినాలనుకుంటే.. గోధుమ పిండిలో తురిమిని బీట్‌రూట్‌ను చపాతీలా తీసుకోవచ్చు. ఇడ్లీలో, దోసలో వినియోగించొచ్చు. బీట్‌రూట్ హల్వా కూడా తినొచ్చు. అయితే, తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. లేదంటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఆరోగ్యపరమైన ఏవైనా సందేహాలుంటే.. వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

Updated Date - Jan 13 , 2024 | 10:10 PM