Share News

Healthy Teas : అల్లం నుండి డాండెలైన్ వరకూ ఈ టీలతో ఎంత ఆరోగ్యమో...!

ABN , Publish Date - Aug 14 , 2024 | 12:19 PM

వెచ్చని టీ శక్తిని పెంచుతుంది. రోజంతా తాజాగా ఉంచుతుంది. మనం తీసుకునే కొన్ని మూలికా టీలు శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపేందుకు సహకరిస్తాయి. ఉదయాన్నే టీ తీసుకోవడం అనేది మనలో చాలామందికి అలవాటు.

Healthy Teas : అల్లం నుండి డాండెలైన్ వరకూ ఈ టీలతో ఎంత ఆరోగ్యమో...!
Health Benefits

వెచ్చని టీ ఉత్సాహాన్ని పెంచుతుంది. రోజంతా తాజాగా ఉంచుతుంది. మనం తీసుకునే కొన్ని మూలికా టీలు శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపేందుకు సహకరిస్తాయి. ఉదయాన్నే టీ తీసుకోవడం అనేది మనలో చాలామందికి అలవాటు. టీ తాగని రోజు ఏదో వెలితిగా ఉంటుంది. అయితే కొన్ని రకాల టీలతో ఉత్సాహంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

అల్లం టీ.. ఘాటుగా ఉండే అల్లంతో టీ చేయడం వల్ల ముఖ్యంగా అందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ధమనుల్లో వాపును తగ్గించే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అల్లంలోని జింజెరాల్ వంటి సమ్మేళనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తప్రవాహం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహకరిస్తుంది.

గ్రీన్ టీ.. మామూలుగా బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని ఎంచుకుంటారు. ఇందులో కొటెచిన్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో సహయపడుతుంది. ధమనులను దెబ్బతినకుండా కాపాడుతుంది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!


మందార టీ.. మందార పూలు భక్తికి చిహ్నాలుగా మనకు తెలుసు. వీటితో దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం. మందారాలతో చేసే టీకి ప్రత్యేకత ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ధమనుల పనితీరును మెరుగుపరుస్తాయి.

పసుపు టీ.. కర్కుమిన్ పసుపులో పుష్కలంగా ఉంది. పసుపు టీ తాగడం వల్ల ధమనుల వాపు తగ్గుతుంది. ఆరోగ్యకరమైన గుండెకు మద్దతు ఇస్తుంది.

Shiny Hair : లావెండర్ ఆయిల్ నుండి అర్గాన్ ఆయిల్ వరకు మెరిసే జుట్టు కోసం ఏది బెస్ట్..

డాండెలైన్ టీ.. డాండెలైన్ టీలో సహజమైన మూత్ర విసర్జన లక్షణాలున్నాయి. ఇవి శరీరం నుంచి అదనపు ద్రవం, టాక్సిన్ తొలగింపుకు సహాయపడతాయి. కాలేయ పనితీరుకు మద్దతు ఇస్తాయి. ధమనుల ఆరోగ్యానికి సహకరిస్తాయి.

ఉదయాన్నే మనం తీసుకునే టీలలో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పెంచే విధంగా మంచి ఎంపిక చేసుకోవాలి. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే టీలను కూడా తీసుకోవడం వల్ల ఉల్లాసం, ఉత్సాహం తప్పక మీదవుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 14 , 2024 | 02:15 PM