weight loss : బరువు తగ్గించే ఈ చిరుధాన్యాల పొడులు ట్రై చేశారా..!
ABN , Publish Date - Jun 20 , 2024 | 12:49 PM
ఊబకాయం నుంచి, ధీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. రాగులు కాల్షియం అధికంగా ఉన్న తృణధాన్యం. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలున్నాయి.
బరువు (Weight Loss ) తగ్గాలనుకునేవారు కాస్త తేలిగ్గా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే బలాన్ని ఇచ్చే ఆహారం కూడా అయి ఉంటాలి. అప్పుడే తేలిగ్గా బరువు తగ్గగలుగుతారు. కడుపు నిండుగా ఉండే విధంగా ఉంటూనే ఈ ఆహారం కొవ్వును కరిగించేదై ఉండాలి. మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా తేలిగ్గా బరువు తగ్గవచ్చు. అయితే వీటిని పిండి రూపంలో తీసుకోవడం ఎంతవరకూ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయనేది తెలుసుకుందాం.
ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో పిండి వాడకం అనేది చపాతీలను చేసేందుకు మాత్రమే వాడుతుంటాం. అయితే ఈ చపాతీలను తయారు చేయడానికి వాడే పిండి గోధుమలతో మాత్రమే తయారు చేసి ఉంటుంది. అలాగే కొన్ని వంటకాల్లో బియ్యం పిండిని కూడా వాడుతూ ఉంటాం. అయితే తృణధాన్యాలతో తయారు చేసిన పిండిని వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
ముఖ్యంగా తృణధాన్యాల పిండిలో ఫైబర్, ఇనుము, ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. పోషకాలు కూడా అధికంగా అందుతాయి. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బావుంటుంది.
జొన్న..
జొన్నల్లో గ్లూటెన్ రహిత పిండి ఇది. ఇందులో డైటరీ ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లతో కూడిన పవర్ ప్యాక్ ఇది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, రాగి, జింక్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి ఎక్కువగా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.
పెర్ల్ మిల్లెట్..
పెర్ల్ మిల్లెట్ లేదా బజ్రా అనేది ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉండే తృణధాన్యాలు. బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప ఆహారం ఇది. రక్తంలో చక్కెర స్ధాయిలము నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
ఫింగర్ మిల్లెట్..
ఫింగర్ మిల్లెట్ రాగులు అని పిలుస్తారు. ఇది గ్లూటెన్ ఫ్రీ, అమైనో ఆమ్లాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఆకలిని తగ్గించడంలో, బరువు తగ్గడానికి, ఊబకాయం నుంచి, ధీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. రాగులు కాల్షియం అధికంగా ఉన్న తృణధాన్యం. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలున్నాయి. డయాబెటీస్ రోగులకు రాగులు మంచి పోషకాలను అందిస్తుంది.
బాదం పిండి..
బాదం పిండి బరువు తగ్గడానికి మంచి ఎంపిక. దీనిలో తక్కువ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఒమేగా 3 ఉంటాయి. బాదం పిండి, గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఫైటిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువ పోషకాలుంటాయి.
శనగలు..
ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. జింక్, ఫోలెట్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. క్యాన్సర్ నిరోధిస్తుంది. గోధుమలతో కలిపి తీసుకుంటే వారాల్లోనే బరువు తగ్గుతారు. బుక్వీట్.. బుక్వీట్ పిండి ఇది జీర్ణక్రియకు సహకరిస్తుంది. మెరుగైన చర్మాన్ని ఇస్తుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
Lose weight : ఈ పొడులతో బరువు తగ్గచ్చా.. ఎంత వరకూ పని చేస్తాయి..!
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.