Health: అధిక జ్వరం ఉంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ప్రమాదం..!
ABN , Publish Date - Jan 08 , 2024 | 09:02 PM
ప్రస్తుత చలికాలంలో చాలా మంది ప్రజలు తీవ్ర జ్వరం, అనారోగ్యానికి గురవుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. అయితే, కొందరు ప్రజలు జ్వరం వచ్చినప్పటికీ.. పట్టించుకోకుండా బయటకు వెళ్లడం, శక్తికి మించిన పనులు చేస్తుంటారు.
Health Tips: ప్రస్తుత చలికాలంలో చాలా మంది ప్రజలు తీవ్ర జ్వరం, అనారోగ్యానికి గురవుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. అయితే, కొందరు ప్రజలు జ్వరం వచ్చినప్పటికీ.. పట్టించుకోకుండా బయటకు వెళ్లడం, శక్తికి మించిన పనులు చేస్తుంటారు. ఇలాంటి వారినుద్దేశించే కీలక సూచనలు చేస్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. అధిక జ్వరం ఉంటే.. ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే.. అనారోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి జ్వరం ఉంటే.. శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అలాంటి పరిస్థితిలో శరీరం డీహైడ్రేట్ అవకుండా చూసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం..
చలికాలంలో చల్లటి గాలి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. వాతావరణంలో మార్పు, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చలికాలంలో జ్వరం వస్తే.. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం సమయంలో అజాగ్రత్తగా ఉంటే.. అనారోగ్య సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుని జ్వరం త్వరగా తగ్గేలా చూసుకోవాలి.
జ్వరం వచ్చినప్పుడు చల్లటి నీటితో అస్సలు స్నానం చేయకూడదు. ఒకవేళ స్నానం చేయాలనుకుంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు. జ్వరం వస్తే రెండు మూడు రోజులు స్నానం చేయకపోయినా పర్వాలేదు అంటున్నారు నిపుణులు. తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పుల్లని పండ్లు, అరటి, పుచ్చకాయ, నారింజ, నిమ్మకాయలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఇక జ్వరం వచ్చినప్పుడు వ్యాయామం అస్సలు చేయొద్దని చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది. దీని వల్ల జ్వరం మరింత పెరగడంతో పాటు.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.