Health Tips: రోజూ సోడా తాగుతున్నారా? ఈ విషయం తెలిస్తే టచ్ కూడా చేయరు..!
ABN , Publish Date - Mar 01 , 2024 | 01:09 PM
Health Tips: వేసవి కాలం వచ్చేసింది. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా(Summer High Temperature) విపరీతమైన దాహం వేస్తుంటుంది. చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్(Cool Drinks), సోడాలు(Soda) తాగుతుంటారు. అయితే, తాత్కాలికంగా ఉపశమనం కలిగించొచ్చు కానీ.. దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Health Tips: వేసవి కాలం వచ్చేసింది. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా(Summer High Temperature) విపరీతమైన దాహం వేస్తుంటుంది. చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్(Cool Drinks), సోడాలు(Soda) తాగుతుంటారు. అయితే, తాత్కాలికంగా ఉపశమనం కలిగించొచ్చు కానీ.. దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ భయానక విషయం ఏంటంటే.. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఓ అధ్యయనంలో వెల్లడించారు.
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సియోల్‌లోని యోన్సీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు స్పష్టం చేశారు. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన డేటా ప్రకారం.. అధ్యయనంలో భాగంగా 1,27,830 మందిపై పరీక్షలు నిర్వహించారట. స్వీట్ కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను అధ్యయనం చేశారు.
దీని ప్రకారం.. సగటున 10 సంవత్సరాలలో 4,459 మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడైంది. కృత్రిమ స్వీట్‌తో తయారు చేసిన డ్రింక్స్ తాగడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం 10 శాతం ఉందన్నారు. దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకుల ప్రకారం.. రోజుకు ఒకటి కంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు 26శాతం పెరుగుతాయని పేర్కొన్నారు. అంతేకాదు.. రోజూ ఈ కూల్ డ్రింక్స్, సోడా తాగడం వల్ల ప్రాణాంతక కిడ్నీ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ఐదో వంతు పెరుగుతుందని చెబుతున్నారు. 10 సంవత్సరాల పాటు ప్రతి రోజూ ఒక గ్లాస్ సోడా తాగే వ్యక్తులకు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు.
సోడాకు బదులుగా ఇవి బెటర్..
ఈ సోడాకు బదులుగా నీరు, పండ్ల రసాలు తాగడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. సహజ సిద్ధమైన పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన డ్రింక్స్ తాగాలని సూచిస్తున్నారు. కిడ్నీల రక్షణకు పండ్ల రసాలు, మంచి నీరు అధికంగా తీసుకోవడం మంచి పద్ధతి అని సూచిస్తున్నారు. ఒకవేళ కిడ్నీ వ్యాధి తీవ్రమైతే, చికిత్స చాలా కష్టతరం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్నిహెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..