Health Tips: తరచుగా కాళ్లలో తిమ్మిరి వస్తుందా? కారణమిదే కావొచ్చు..!
ABN , Publish Date - Feb 26 , 2024 | 10:56 AM
Vitamin B12 Deficiency: ఆరోగ్యం బాగుండాలంటే.. మంచి పోషకాలు ఉన్న ఆహారం(Healthy Food) తీసుకోవాలి. అలాగే జీవన శైలి కూడా బాగుండాలి. రోజూ వ్యాయామం చేయాలి. సమయానికి నిద్రపోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మన ఆరోగ్యం(Health) బాగుంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ ఉరుకులు, పరుగులు మీద సాగుతోంది. ప్రస్తుత కాలంలో 30 ఏళ్ల దాటిన యువతీ, యువకులు కాళ్లు, కీళ్ల నొప్పులు..
Vitamin B12 Deficiency: ఆరోగ్యం బాగుండాలంటే.. మంచి పోషకాలు ఉన్న ఆహారం(Healthy Food) తీసుకోవాలి. అలాగే జీవన శైలి కూడా బాగుండాలి. రోజూ వ్యాయామం చేయాలి. సమయానికి నిద్రపోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మన ఆరోగ్యం(Health) బాగుంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ ఉరుకులు, పరుగులు మీద సాగుతోంది. ప్రస్తుత కాలంలో 30 ఏళ్ల దాటిన యువతీ, యువకులు కాళ్లు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తిమ్మిర్ల సమస్యతో సతమతం అవుతున్నారు. దీనంతటికీ కారణం శరీరంలో పోషకాల లోపమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఈ రోజుల్లో విటమిన్ బి12 పెద్ద సమస్యగా మారింది. చాలామంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. B12 శరీరంలోని వివిధ అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. శరీరం తనంతట తానుగా B12 ను ఉత్పత్తి చేయదు. అందుకే.. ఆహారం ద్వారా విటమిన్ B12 పొందాలి. ఇది జంతు మాంసంలో కూడా ఉంటుంది. కాలేయం ఈ బి12 విటమిన్‌ను ఐదేళ్ల వరకు నిల్వ చేస్తుంది. ఆ నిల్వ కూడా తగ్గినప్పుడు.. విటమిన్ లోపం ఏర్పడుతుంది. ఇది శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
బి12 లోపం వల్లే కలిగే సమస్యలు..
విటమిన్ B12 లోపం మానసిక కల్లోలం ఉంటుంది. కండరాల నొప్పి, కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, విపరీతమైన బరువు తగ్గడం, నడకలో అస్థిరత, చిరాకు, అలసట, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. హృదయ స్పందన రేటు పెరగడం వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. పనిలో కూడా చాలా గందరగోళం నెలకొంటుంది. ఆకలి లేకపోవడం, విపరీతమైన నీరసం, జ్ఞాపకశక్తి కోల్పోవడం మొదలైనవి లక్షణాలు ఉంటాయి. కండరాలు బలహీనమవుతాయి. విటమిన్ బి12 లోపం వల్ల రాత్రిపూట చెమటలు పట్టుతాయి. కొన్నిసార్లు డిప్రెషన్ కూడా వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు విటమిన్ బి12 ఉన్న ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు.