Health benefits : కీళ్ళనొప్పులు తగ్గించే గుమ్మడి గింజలలో ఎన్ని పోషకాలో.. !
ABN , Publish Date - Jul 17 , 2024 | 01:34 PM
గుమ్మడి కాయ గింజల్లో మెగ్మీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి.
మనం తీసుకునే చాలా ఆహారాల్లో కొన్ని తెలీకుండానే మంచి పోషకాలను తీసుకుంటూ ఉంటాం. అవి మన శరీరానికి ఇచ్చే శక్తికి, దృఢత్వాన్ని లెక్కల్లో చెప్పలేం. చిన్నతనం నుంచి కూరల్లో వేసుకునే కూర గుమ్మిడి అందరికీ తెలిసిన భారీ కూరగాయ ఇది. సొరకాయ, బూడిద గుమ్మడి, కూరగుమ్మడి చూడడానికి కాస్త పెద్ద ఆకారంలో ఉన్నా ఇవి చేసే మేలు మాత్రం వాటిలాగే కాస్త పెద్దగానే ఉంటుంది. కూరగుమ్మడిని దాదాపు అందరూ చిన్న వయసు నుంచీ తింటూనే ఉంటారు.
గుమ్మడికాయలోని గింజల విషయాలనికి వస్తే వీటి పైన జిగురు పోయేందుకు కట్టెల బూడిద రాసి పెద్దవాళ్ళు తినమని పెట్టేవారు. ఇప్పుడు కాలం మారాకా కాస్త ఎక్కువగానే చెబుతున్నారు బూడిదగుమ్మడి గింజలు చాలా ఆరోగ్యమని. తెలియకపోయినా చిన్నతనంలో అంతా తిన్నవాళ్ళమే. ఇక ఇందులోని పోషకాల గురించి ఇంత బాగా తెలిసాకా ఎందుకు వదులుతాం. తప్పకుండా రోజూ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూసుకోవాల్సిందే మరి.. వీటిలోని పోషకాల జాబితాకు వస్తే..
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి..
గుమ్మడి కాయ గింజల్లో మెగ్మీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి.
గుండె ఆరోగ్యానికి కూడా..
గుమ్మడి గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వీటిలోని మెగ్నీషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Dengue fever : డెంగ్యూ జ్వరం కారణంగా మెదడు మీద కూడా ప్రభావం ఉంటుందా..!
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గుమ్మడి గింజలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహరిస్తుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
ఒమేగా 3 లు, ఒమేగా 6లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది.
Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!
ప్రోటీన్స్ మూలం..
గుమ్మడికాయ గింజలు మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను అందిస్తాయి. దీనితో శరీరంలో కండరాల మరమ్మత్తులు, పెరుగుదల కూడా ముఖ్యంగా పనిచేస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు..
గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
జీర్ణ ఆరోగ్యం..
డైటరీ ఫైబర్ ఇది జీర్ణక్రియను క్రమం చేస్తుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.