Share News

Health Benefits : ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ మూడు పదార్థాల గురించి మీకు ఎంత వరకూ తెలుసు..!

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:20 PM

నల్ల ఉప్పు, వాము గింజలు, ఇంగువతో గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఛాతీ మంట, అసిడిటీని సులభంగా నియంత్రించవచ్చు. ఇందులోని యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ ఎలిమెమట్స్ గ్యాస్ రిలీఫ్‌కి సహకరిస్తాయి.

Health Benefits : ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ మూడు పదార్థాల గురించి మీకు ఎంత వరకూ తెలుసు..!
Health Benefits

ఆయుర్వేదంలో ప్రతి మొక్కా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించి వైద్య విధానంలో ఎక్కువగా మొక్క ఆధారిత ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. అయితే మనం ఇంట్లో వంటలకు వాడే చాలా పదార్థాలలో మనకు తెలియని ఔషధ గుణాలున్నాయి. వీటిలో వంటగదిలోని ఆయుర్వేద పదార్థాలను గురించి మాట్లాడుకోవాలంటే వాము గింజలు, ఉప్పు, ఇంగువ ఈ మూడింటిలోని గుణాలను గురించి తెలుసుకుందాం.

ఈ పదార్థాల ద్వారా గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్, యాంటిస్పాస్మోడిక్ వంటి లక్షణాలు ఇంగువలో ఉన్నాయి. బ్లాక్ సాల్ట్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ మూడు పదార్థాలను కలిపి తింటే అనేక రకాల పొట్ట సమస్యలు తగ్గుతాయి.

వీటితో ఉపయోగం..

గ్యాస్ నుంచి రిలీఫ్.. నల్ల ఉప్పు, వాము గింజలు, ఇంగువతో గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఛాతీ మంట, అసిడిటీని సులభంగా నియంత్రించవచ్చు. ఇందులోని యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ ఎలిమెమట్స్ గ్యాస్ రిలీఫ్‌కి సహకరిస్తాయి.

జీర్ణశక్తిని పెంచుతుంది.. ఆహారం తేలికగా జీర్ణం కాకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నవారు వాము గింజలు థైమోల్ అనే సమ్మోళనం ఉంది. దీనిని ఒక స్పూన్ తీసుకుని, నల్ల ఉప్పు, ఇంగువ పొడి తగినంత కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్యలతో పాటు, బరువు కూడా తగ్గుతారు.


Back Pain : నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే తక్షణమే ప్రభావం చూపే మార్గాలివే..

వాము గింజలతో పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు.

తక్కువ రక్తపోటు.. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ పొడిని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి.

Back Pain : నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే తక్షణమే ప్రభావం చూపే మార్గాలివే..

జలుబు నుంచి ఉపశమనం.. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 21 , 2024 | 03:20 PM