Health Tips : అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా.. ఇవి తింటే కీళ్ల నొప్పులు ఉండవా..!
ABN , Publish Date - Aug 10 , 2024 | 01:19 PM
అవిసె గింజల్లో ఒమేగా కొవ్వులు, లిగ్నాన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఎముక బలాన్ని పెంచుతాయి. అవిసె గింజలు ఎముక శక్తిని, ఎముకలు దృఢంగా మారేందుకు ఖనిజ పదార్థాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే లినోలెనిక్ యాసిడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎముక నష్టం, బోలు ఎముక వ్యాధిని తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది.
కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తీసుకునే ఆహారంలో సమతుల్య ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. తాజా కూరలు, పండ్లు తృణధాన్యాలు ఆరోగ్యం పెంచడంలో సహకరిస్తాయి. తృణధాన్యాలలో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అవిసె గింజలు, అనేక పోషకాల భాండాగారం. ఇందులో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం.
అవిసెలు ఫైబర్ అధికంగా ఉండే పంట.ఇందులో అల్ఫాలీనో లెనిక్ యాసిడ్ నిండి ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ మలబద్దకం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, లూపస్ ఉన్నవారిలో మూత్రపిండాల వాపు తగ్గిస్తుంది. ఇందులోని అధిక ఫైబర్ కారణంగా అవిసెగింజలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. అవిసెలను తిన్న తర్వాత నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉండవు.
కీళ్ల నొప్పులకు ఈ గింజలతో కలిగే ప్రయోజనాలు..
అవిసె గింజల్లో ఒమేగా కొవ్వులు, లిగ్నాన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఎముక బలాన్ని పెంచుతాయి. కీళ్లు అరిగిపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలకు ఈ గింజలు చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి. అవిసె గింజలు ఎముక శక్తిని, ఎముకలు దృఢంగా మారేందుకు ఖనిజ పదార్థాన్ని పెంచుతాయి. ఇందులో ఉండే లినోలెనిక్ యాసిడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎముక నష్టం, బోలు ఎముక వ్యాధిని తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈస్ట్రోజెన్ తగ్గినపుడు పిరియడ్స్ సమయంలో ఎముకలు బలహీనం అవుతాయి.
Health Tips : ఒత్తిడిగా అనిపిస్తే నోరు పొడిబారుతుందా.. ఇది ఇంకా దేనికి సంకేతం..!
బరువు తగ్గుతుంది.
అవిసెలు బరువు తగ్గాలనుకునే వారికి తేలిగ్గా తీసుకోగలిగే ఆహారం. అవిసె గింజల్లో ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది.
స్త్రీ ఆరోగ్యానికి..
స్త్రీ ఆరోగ్యానికి హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడేందుకు, పిరియడ్స్ సమయంలో తిమ్మిరి, నొప్పి తగ్గించడంలో సహకరిస్తుంది.
Health Tips : నిద్ర పక్షవాతం గురించి ఈ విషయాలు తెలుసా...!
కొలెస్ట్రాల్ నియంత్రణ..
కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వేయించిన అవిసె గింజలను వాడితే సరిపోతుంది.
పాలతో చేసిన ఓట్స్‌లో అవిసె గింజలను కలిపి తీసుకోవచ్చు. చట్నీ చేసుకుని తినచ్చు. ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యతకు అనువైన పదార్థంగా అవిసె గింజలు ఉపయోగపడతాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.