Stomach Health : పొట్టలో ఈ భాగం పనిచేయకపోతే ఇన్ని తిప్పలా..!
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:55 PM
ప్యాంక్రియాస్‌లో సమస్య ఉంటే కనుక, ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌ల స్రావం తగ్గుతుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలుంటాయి.
శరీరంలో ఏ భాగానికి నొప్పి, బాధ, ఇబ్బంది కలిగినా మొత్తం ఆరోగ్యం సరిగా లేనట్టే.. శరీరంలో ప్రధాన భాగాలైన గుండె, మెదడు మాదిరిగానే పొట్ట కూడా చాలా కీలకమైన భాగమే. ఇందులోని ప్రతి అవయవం సరైన రీతిలో పనిచేస్తేనే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా ప్రాంక్రియాస్ (క్లోమ గ్రంధి) శరీరంలో సహజ రసాలను, ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది సరిగా పనిచేయనప్పుడు శరీరంలో కనిపించే వివిధ లక్షణాలను గురించి తెలుసుకుందాం.
పొట్టలో ఉండే పెద్ద ప్రేగులు, చిన్నప్రేగులు జీర్ణ సంబంధమైన క్రియలలో పాల్గొంటాయి. ఇక్కడే మరో ముఖ్యమైన అవయవం కూడా ఉంది. అదే ప్యాంక్రియాస్ ఇది మన శరీరానికి జీర్ణ ఎంజైములు, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కొవ్వును జీర్ణం చేసే ఎంజైమ్ అయిన లిపేస్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతే కాకుండా ప్రోటీన్‌ను జీర్ణం చేసే ప్రోటీజ్ ఎంజైమ్, కార్బోహైడ్రేట్‌లను సరిగ్గా జీర్ణం చేసే అమైలేస్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
శరీరంలోని ముఖ్యమైన అవయవం అయిన ప్యాంక్రియాస్ సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, కొన్ని రకాల మందులను వాడటం వల్ల దెబ్బతింటుంది. ఇది సరిగా పనిచేయకపోతే ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కింద గుర్తిస్తారు.
Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !
ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
పొత్తికడుపులో నొప్పి ఉంటుంది.. కొన్నిసార్లు అదే పనిగా కడుపులో నొప్పి మొదలవుతుంది. దీనితో పాటు జీర్ణక్రియ కారణంగా, శరీరంలోని ఎంజైములు, పిత్తరసంలో ఇబ్బంది ఉంటుంది. దీని కారణంగా ప్యాంక్రియాస్‌లో నొప్పి, మంట, ఇతర వ్యాధులు వస్తాయి.
బరువు తగ్గుతారు..
ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు ఆహారం నుండి విడుదల అయ్యే పోషకాలు తగ్గుతాయి. ఈ కారణంగా ఎంత ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాలను తీసుకున్నా కూడా శరీరం గ్రహించదు. ఇది బరువును ప్రభావితం చేయడం మొదలవుతుంది. దీనితో బరువు తగ్గి, బలహీనంగా మారతారు.
Women With Diabetes : మధుమేహం ఉన్న స్త్రీలలో అధికంగా కనిపించే సంకేతాలు ఇవే..
వాంతులు అవుతాయి.
ప్యాంక్రియాస్‌లో సమస్య ఉంటే కనుక, ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌ల స్రావం తగ్గుతుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలుంటాయి. ఇదే సమయంలో జిడ్డుగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ప్యాంక్రియాస్ దానిని విచ్ఛిన్నం చేయదు. దీని కారణంగా వాంతులు, వికారం ఉంటాయి.
విరేచనాలు..
తరచుగా విరేచనాలు అవుతాయి. ఇది జీర్ణక్రియ సమస్య సరిగా లేదని, ప్రాక్రియాస్ పనిచేయడంలేదని సూచిస్తుంది. శరీరం కొవ్వు, ప్రోటీన్లను జీర్ణించుకోలేక విరేచనాలు అవుతాయి.
Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..!
ఉబ్బరం కూడా ఉంటుంది.
పొట్ట ఉబ్బరం ఉంటుంది. తిన్న వెంటనే కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్యాంక్రియాస్ ఆహారాన్ని జీర్ణంచేసుకోలేక, గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి చేయలేకపోతుంది. దీని కారణంగా ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.