Share News

Health Tips : పొట్ట ఆరోగ్యాన్ని పెంచే పానీయం ఇదే.. !

ABN , Publish Date - Aug 09 , 2024 | 11:53 AM

మెంతి గింజలు మన భారతీయ వంటకాల్లో ముఖ్యంగా వాడుతుంటాం. కూరల నుంచి ఊరగాయల వరకూ ఏదో విధంగా మెంతులు ఉంటూనే ఉంటాయి. మెంతులు, మెంతుకూరలో చాలా పోషకాలున్నాయి. పరగడుపునే మెంతి నీరు తాగినట్లయితే మధుమేహం ఉన్నవారికి గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. మెంతులు, సోపు గింజలు, పసుపు, దాల్చిన చెక్కతో చేసే ఈ పానీయం ఆరోగ్యపరంగా మంచి శక్తిని ఇస్తుంది.

Health Tips : పొట్ట ఆరోగ్యాన్ని పెంచే పానీయం ఇదే.. !
Health Benefits

మెంతి గింజలు మన భారతీయ వంటకాల్లో ముఖ్యంగా వాడుతుంటాం. కూరల నుంచి ఊరగాయల వరకూ ఏదో విధంగా మెంతులు ఉంటూనే ఉంటాయి. మెంతులు, మెంతుకూరలో చాలా పోషకాలున్నాయి. పరగడుపునే మెంతి నీరు తాగినట్లయితే మధుమేహం ఉన్నవారికి గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. మెంతులు, సోపు గింజలు, పసుపు, దాల్చిన చెక్కతో చేసే ఈ పానీయం ఆరోగ్యపరంగా మంచి శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని, ప్రేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెంతులు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహకరిస్తాయి. జీవక్రియను వేగవంతం చేయడానికి రాత్రిపూట మెంతుల్ని నానబెట్టాలి. దీనిని ఎలా తీసుకోవాలంటే..

మధుమేహం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు మెంతిగింజలు చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి. 1 లేదా 2 టీ స్పూన్లు కడిగిన మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే తీసుకోవాలి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య నియంత్రణలో ఉంటుంది.

Superfood Rosehip : ఈ గులాబీ పండ్ల ఎప్పుడైనా తిన్నారా..!


మెంతుల్లో గ్లూకోమానన్ ఫైబర్ ఉంది. ఇవి చక్కెరను ప్రేగుల్లో కలవడాన్ని ఆలస్యం చేస్తాయి. ఇందులోని అమైనో ఆమ్లాలు ఇన్సులిన్ విడుదల చేయడానికి ప్యాంక్రియాస్ పై పనిచేస్తాయి. మెంతి గింజలు చర్మం నిగారింపును, చికాకును తగ్గిస్తాయి. మెంతులతో పాటు ఈ పదార్థాలను కలిపి ఉదయాన్నే పానీయంగా తీసుకుంటే పొట్ట ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

సోంపు గింజల్లో యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలున్నాయి. ఇవి ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. జీర్ణ కండరాలను సడలించడం, జీర్ణక్రియకు సహకరించడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ ప్రయోజనాలను అందిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రించడంలో సహకరిస్తుంది.

Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?

పసుపులో కర్కుమిన్, వాపును తగ్గిస్తుంది. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవన్నీ కలిపి చేసే పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఉబ్బసం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


Health Tips : ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు తాగడం ఆరోగ్యమేనా..!

పై పదార్థాలతో కలిపి చేసిన ఈ పానీయం ఉదయాన్నే పరగడుపుతో, భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ పానీయాన్ని తీసుకోవాలి అనుకుంటే వైద్యులను సంప్రదించడం సలహా తీసుకోవడం బెటర్.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 09 , 2024 | 01:38 PM