Health Symptoms : ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం .. వ్యాయామం చేయాల్సిందే..!
ABN , Publish Date - Jul 18 , 2024 | 04:49 PM
చాలామందిలో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా కూడా వ్యాయామం చేయాల్సిందే. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
వ్యాయామం అనేది శరీరానికి చాలా అవసరం. ఒక వేళ ఏంచేతనైనా వ్యాయామం అనేది చేయకపోతే మన శరీరం ఇట్టే పెరుగుతుంది. సాధారణం నుంచి ఊబకాయం వరకూ పరిస్థితి మారుతుంది. దీనితో అనేక శరీర రుగ్మతలు. నిజానికి మనుషుల్లో చాలా మంది ఉదయం లేచింది మొదలు శరీర శ్రమ తప్పితే మరోలా వ్యాయామం చేయడం తెలీనివాళ్ళే కానీ సమస్య శరీరక శ్రమ గురించి కాదు.
వ్యాయామం లేకపోవడం, ఇదీ మరీ, ఇక అనారోగ్యం ఏదైనా వచ్చిందంటే ఉదయానికల్లా తగ్గిపోవాల ని చూస్తాం. అసలు వ్యాయామం చేయని వాళ్ళలో ఇలాంటి లక్షణాలు కనుక కనిస్తే ఆలస్యం చేయకుండా వ్యాయామం చేయడం మొదలు పెట్టండి.
సరైన వ్యాయామం లేకపోతే మన శరీరం చాలా లక్షణాల ద్వారా ఆ పిరిస్థితిని మన ముందు ఈ లక్షణాలను బయటపెడుతుంది. వ్యాయామం చేస్తున్నట్లయితే శరీరంలో ఎలాంటి నొప్పులూ ఉండవు. అదే వ్యాయామం లేకపోతే వెన్ను, నడుము, కాళ్లలో నొప్పులు ఉంటాయి. చేతులు, భుజాలు, మెడ భాగాలలో కూడా నొప్పులు ఉంటాయి.
Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!
వ్యాయామంతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. చాలామందిలో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా కూడా వ్యాయామం చేయాల్సిందే. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు ఉంటాయి. ఇలా ఉంటే వ్యాయామంచేయాలని అర్థం. మైండ్ అండే బాడీ రిలాక్స్ కావాలంటే వ్యాయామం తప్పని సరి. దీనితో డిప్రెషన్ తగ్గుతుంది, ప్రశాంతత ఉంటుంది. రాత్రి సమయంలో చక్కని నిద్ర ఉంటుంది.
Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!
చాలామంది జంక్ ఫుడ్ కు అలవాటు పడటం కూడా త్వరగా కీళ్లనొప్పులు, శరీరం బాధలకు కారణం కావచ్చు. ఆకలి మందగించడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, మెట్లు ఎక్కుతుంటే ఆయసం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వేంటనే వ్యాయామం చేయడం మొదలుపెడితే సరి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.