Share News

Jaiphal Water : జాజికాయ నీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు పరార్.. ట్రై చేసి చూడండి.

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:44 PM

జాజికాయ నీటిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

Jaiphal Water : జాజికాయ నీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు పరార్.. ట్రై చేసి చూడండి.
immune system

జాజికాయ మంచి సువాసన, మత్తెక్కించేట్టుగా ఉంటుంది. ఏ మసాలా వంటకంలో చూసినా జాజికాయ తప్పక ఉంటుంది. జాజికాయ మసాలా దినుసుగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. వగరు రుచిని కలిగి ఉండే జాజికాయ నీటిని తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు అందుతాయట. ఈ నీటిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను అందుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణ ఇబ్బందులనుంచి జాజికాయ నీరు బయటపడేస్తుంది. దీని గురించి ఇంకా తెలుసుకుందాం.

జీర్ణ ఆరోగ్యానికి జాజికాయ..

జాజికాయ నీటిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ గ్లాసు జాజికాయ నీటితో మెరుగుపడుతుంది. కడుపు అసౌకర్యం దీనితో దూరం అవుతుంది.

Over Thinking : మరీ ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా.. ఆలోచన మానుకోవాలంటే.. !

నిద్రకు కూడా జాజికాయ మంచిదే..

జాజికాయ నీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి జాజికాయ చక్కని పరిష్కారంలా పనిచేస్తుంది. నిద్రవేళకు జాజికాయ పొడిని కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర సొంతం అవుతుంది. గోరువెచ్చని నీటితో దీనిని తీసుకుంటే మెరుగ్గా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకరిస్తుంది. అంటువ్యాధుల సమస్య కూడా దూరం అవుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక ప్రతిస్పందనకు దోహదపడుతుంది.


Women Health : గర్భిణీలకు ఎంత సమయం నిద్ర కావాలి.. సరైన నిద్ర లేకపోతే.. !

కాలేయానికి..

కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి జాజికాయ ఆరోగ్యవంతమైన మద్దతు ఇస్తుంది. జాజికాయలో మిరిస్టిసిన్, మాసిలిగ్నన్ ఉన్నాయి. ఇవి టాక్సిన్స్ బయటకు పంపి కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

నొప్పి, వాపు తగ్గిస్తుంది..

జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. శరీరంలో నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్లనొప్పులు, కండరాల నొప్పిని తగ్గించడంలో ప్రత్యేకంగా ప్రభవవంతంగా పనిచేస్తాయి. నీటిలో చిటికెడు జాజికాయ పొడిని వేసి తీసుకుంటే నొప్పి తక్షణమే తగ్గుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 13 , 2024 | 03:45 PM