Share News

Boost Immunity : డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు రోగి ఈ పండ్లు తీసుకుంటే సరి ..!

ABN , Publish Date - Jul 04 , 2024 | 01:31 PM

డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లయితే ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే కివీని పండు తినాలి.

Boost Immunity : డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు రోగి ఈ పండ్లు తీసుకుంటే సరి ..!
Boost Immunity

దోమలు మరీ పెరిగే కాలం వానాకాలం.. వానలు మొదలవగానే ఎక్కడ లేని దోమలు పుట్టుకొచ్చేస్తూ, కుట్టిపోతూనే ఉంటాయి. దోమలు పెరిగితే దానితోపాటే వ్యాధులూ పెరుగుతాయి. ముఖ్యంగా దోమలతో వచ్చే వ్యాధుల్లో డెంగ్యూ, మలేరియా ప్రధానంగా సోకే వ్యాధులు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నవారు రోగనిరోధక శక్తిని పెంచడానికి బలమైన ఆహారం తీసుకోవాలి.

ముఖ్యంగా ఈ పండ్లను తీసుకుంటే మంచిది. వర్షం నీరు నిలిచిపోవడం దానిలో దోమల పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల మలేరియా, చికున్ గున్యా డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అందువల్ల వర్షాలు పడే కాలంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు పండ్లను తినాలి. డెంగ్యూ వస్తే కోలుకోవడానికి ఏ పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి, అనేది తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎక్కువ దృష్టి పెట్టాలి.

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సీజన్లో ఇన్ఫెక్షన్ ముప్పు చాలా ఎక్కువ. దీని వల్ల ఏదైనా వైరస్ శరీరంపై దాడి చేస్తుంది. ఇందుకోసం విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.

Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!

డెంగ్యూలో ఏ పండ్లు తినాలి..

డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లయితే ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే కివీని పండు తినాలి. డెంగ్యూ రోగులు రోజూ బొప్పాయిని తీసుకోవాలి.


Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!

బొప్పాయిలో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్లేట్ లెట్స్‌ను పెంచడంలో సహకరిస్తుంది. బెర్రీలు కూడా ఈ సమయంలో మంచి పోషణను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డెంగ్యూను ఎదుర్కునే మరో పండు దానిమ్మ ఇందులో అనేక పోషకాలున్నాయి.

డెంగ్యూ వ్యాధికి కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. వర్షాకాలంలో అధికంగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొబ్బరినీరు తీసుకోవడం వల్ల రోగికి శక్తితో పాటు శరీరానికి మినరల్స్ లోపం తగ్గుతుంది. డెంగ్యూ వచ్చినప్పటి నుంచి వేడిచేసి మరిగించి, చల్లార్చిన నీటినే తీసుకోవాలి. అలాగే బయటి పదార్థాలు, ఆహారాలు కాకుండా ఇంట్లో తయారు చేసిన పదార్థాలనే తీసుకుంటూ ఉండాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 04 , 2024 | 01:31 PM