Share News

Health Tips : మధుమేహాన్ని మెరుగ్గా నిర్వహించే కాయధాన్యాలు..

ABN , Publish Date - Jul 16 , 2024 | 02:07 PM

ఫైబర్, ఫోలేట్, పోటాషియంతో నిండిన మొక్కల ఆధారిత ప్రోటీన్ల అద్భుతమైన మూలం పప్పులు, ఇవి జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి.

Health Tips : మధుమేహాన్ని మెరుగ్గా నిర్వహించే కాయధాన్యాలు..
Health Tips

శరీరానికి బలాన్ని, ఆరోగ్యాన్ని అందివ్వాలంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దరిచేరే అవకాశం చాలా వరకూ తక్కువగా ఉంటుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ వంటివి కంట్రోల్లో ఉండాలన్నీ తీసుకునే ఆహారం సరైనదై ఉండాలి. మామూలుగా మధుమేహం ఉన్నవారు అన్ని ఆహారాలను గబగబా తినేయ కూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండే విధంగా బీన్స్, బఠానీ, కాయధాన్యాలు, చిక్ పీస్ వంటి పప్పులను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇవి చెడుకొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అలాగే గుండె ఆరోగ్యం పైనా ప్రభావాన్ని చూపుతాయి.

తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్టాల్,సిప్టోలిక్ రక్తపోటు, డయాస్టోలిక్ రక్తపోటు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్ A1c

బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ తప్పక ఉండాలి. ప్రోససింగ్ ఆహారం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుని దానిని మన డైట్లో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో పప్పుధాన్యాలను ఎంచుకోవడం వల్ల షుగర్ స్థాయిలు నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది.

Over Thinking : మరీ ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా.. ఆలోచన మానుకోవాలంటే.. !


ఇవి ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, కార్టియోవాస్కులర్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులతో బాధపడుతున్న వారిలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

ఫైబర్, ఫోలేట్, పోటాషియంతో నిండిన మొక్కల ఆధారిత ప్రోటీన్ల అద్భుతమైన మూలం పప్పులు, ఇవి జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి మొక్కల ద్వారా తక్కువ కొవ్వు కంటెంట్, అసంతృప్త కొవ్వులు, కీలకమైన సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షమాలను కలిగి ఉన్న బయోయాక్టివ్ సమ్మేళనాలతో కలిపి ఉన్న పోషకాల గని పప్పులు. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుత ఫలితాలను అందుకోవచ్చు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 16 , 2024 | 02:07 PM