Share News

Super Food : రాగులతో బరువు తగ్గడం సులువే.. దీనితో ఇంకా బోలెడు లాభాలు..!

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:43 AM

రాగుల్లోని కాల్షియం, బలహీనమైన ఎముకలను దృఢంగా మారుస్తుంది.

Super Food :  రాగులతో బరువు తగ్గడం సులువే.. దీనితో ఇంకా బోలెడు లాభాలు..!
ragulu

త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఆహారాన్ని తగ్గించి తీసుకుంటూ ఉంటాం. అయితే శరీరంలో బరువు తగ్గేందుకు సరిగ్గా సరిపడే ఫుడ్స్ తీసుకోవాలి. సూపర్ ఫుడ్స్ లో ముఖ్యంగా మిల్లెట్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ముఖ్యంగా రాగులు చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్నగా కనిపించినా ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, శరీరాన్ని దృఢంగా మార్చడంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులకు ఇది చక్కని పరిష్కారం. ఆరోగ్యకరమైన శరీరం కోసం స్థూలకాయాన్ని నియంత్రించడం చాలా అవసరం. రాగులు తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను తగ్గించడమే కాకుండా బరువు తగ్గించే విషయంలోనూ సహకరిస్తుంది.

రాగులు.. ఆరోగ్య గని..

రాగులలో విటమిన్ సి, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్, తగిన కేలరీలు వంటి అనేక పోషకాలున్నాయి. రాగి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బరువు తగ్గుతుంది..

బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు రాగులను ఆహారంగా చేర్చుకోవాలి. రాగిలో ఉండే అధిక ఫైబర్, ప్రోటీన్ పొట్టను నిండుగా ఉంచుతుంది. బరువును నియంత్రించడానికి సహకరిస్తుంది.

కొలెస్ట్రాల్..

రాగులను తీసుకోవడం వల్ల బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ మెరుగవుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

జీర్ణక్రియ సాఫీగా..

రాగుల్లో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!

ఒత్తిడి తగ్గిస్తుంది.

రాగిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

చక్కెర స్థాయిలు..

రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సలిన్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

ఎముకలకు బలం..

రాగుల్లోని కాల్షియం, బలహీనమైన ఎముకలను దృఢంగా మారుస్తుంది.

రాగి రోటీలు, ఇడ్లీ, రాగి జావ, రాగి దోస, రాగి ముద్ద రాగులతో ఎటువంటి పదార్థాన్ని చేసినా మంచి రుచితో ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 11 , 2024 | 10:43 AM