High cholesterol : ఈ లక్షణాలు గమనిస్తే ఇట్టే చెప్పచ్చు.. పురుషుల్లో అధిక కొలెస్ట్రాల్ ఉందని.. అవేమిటంటే..!
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:40 PM
ప్రత్యేకంగా వారసత్వం, జీవన శైలి మార్పులు, హార్మోన్లు కూడా పాత్ర పోషిస్తాయి అందుకే పురుషుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలో కనిపించే మైనపు పదార్థం. ఇది కణాల ఉత్పత్తికి అవసరం, తక్కువ సాంద్రత ఉండే లిపో ప్రోటీన్ LDL రక్తంలో అధికంగా ఉంటే కనక ఇది గుండెకు హాని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది పురుషులలో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్య. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం కారణంగా కనిపించే లక్షణాలలో ముఖ్యంగా చేతుల్లో, వేళ్లల్లో ఈ సమస్య ఉన్నట్టుగా సంకేతాలు కనిపిస్తాయి. ఈ సమస్య గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
అధిక కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
అధిక కొలెస్ట్రాల్ మన రక్త ప్రవాహంలో ఉండే మైనపు కొవ్వు లాంటి ఏజెంట్. ఆరోగ్యకరమైన కణ నిర్మాణం కోసం మనకు ఇది అవసరపడుతుంది. కానీ ఉండే దానికంటే ఎక్కువ శాతం ఈ కొలస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బుల ప్రమాదంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పురుషులలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు..
అధిక కొలెస్ట్రాల్ స్త్రీలతో పోల్చితే పురుషులలో గుణాంకాల పరంగా ముందు ఉంది. ప్రత్యేకంగా వారసత్వం, జీవన శైలి మార్పులు, హార్మోన్లు కూడా పాత్ర పోషిస్తాయి అందుకే పురుషుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. దీని కారణంగా గుండె పోటు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ వ్యాధులు వంటి ప్రమాదాలు కలగవచ్చు.
1. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లయితే వేళ్లు, చేతి వేలి గోళ్లపై చిన్న పసుపు మచ్చలు కనిపిస్తాయి. వీటిని శాంతోమాస్ అని పిలుస్తారు.
2. చర్మం మందంగా మారడం మరో లక్షణం, అదనపు కొలెస్ట్రాల్ చర్మంలో పేరుకుపోయి, చర్మం గట్టిపడుతుంది.
3. వేళ్ళు, చేతుల్లో తిమ్మిరి, జలదరింపు ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న పురుషుల్లో ఈ లక్షణాలు కానీ కనిపిస్తే ధమనుల్లో రక్త ప్రసరణ సాఫీగా జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!
4. అధిక కొలెస్ట్రాల్ కారణంగా చల్లని చేతులు, వేళ్లు వంటి లక్షణం కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు క్రమం తప్పకుండా ఉంటే అది కొలెస్ట్రాల్ సమస్యను సూచిస్తుంది.
5. అలసిపోయిన, బలహీనమైన చేతులు, వేళ్లు అధిక కొలెస్ట్రాల్ లక్షణాల్లో ఒకటి.
6. వస్తువులను పట్టుకోలేకపోవడం, సామర్థ్యాన్ని కోల్పోవడం కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాల్లో ఉంది.
ఇది సరైన జీవన శైలి లేకపోవడం, రెగ్యులర్ డైట్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల వస్తుంది. మంచి ఆహారాన్ని తీసుకుని, జీవనశైలి మార్పులతో పాటు వ్యాయామం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.