Healthy Food : మల్బరీ ఫ్రూట్ తీసుకుంటే ఇన్ని లాభాలా..!
ABN , Publish Date - May 02 , 2024 | 03:49 PM
మల్బరీ పండ్లలో అనేక రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇంకా విటమిన్ కె, ఐరన్, పొటాషియం, డైటరీ ఫైబర్లున్నాయి.
మనం తీసుకునే ఆహారంలో ప్రకృతి సిద్ధంగా దొరికేవే ఎక్కువ. వేసవిలో వచ్చే చాలా రకాల పండ్లలో మల్బరీ పండ్లు ఒకటి. వీటికి ప్రత్యేకమైన రుచి ఉంది. మల్బరీ పండ్లలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉన్నాయి. ఈ జ్యూసీ బెర్రీలు ఎరుపు, నలుపు, తెలుపు రంగులలో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా తిన్నా, లేదంటే ఎండబెట్టి తిన్నా కూడా మల్బరీ డిజర్ట్, జామ్, స్మూతీలు వంటివాటిలో కలిపి తిన్నా కూడా రుచిగా ఉంటాయి. మల్బరీ పండ్లు నోటి రుచి మొగ్గలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటుంది. ఈ పండ్లను తీసుకుంటే శరీరానికి ఎలాంటి బెనిఫిట్సో తెలుసుకుందాం.
పోషకాల లెక్క..
మల్బరీ పండ్లలో అనేక రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇంకా విటమిన్ కె, ఐరన్, పొటాషియం, డైటరీ ఫైబర్లున్నాయి.
రక్తంలో చెక్కల శాతం..
మల్బరీ పండ్లలో డియోక్సినోజిరిమైసిన్ అనే ప్రత్యేక సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీర్ణ క్రియను సఫీగా చేస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది.
Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!
కొలెస్ట్రాల్..
మల్బరీ పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
కణాలను దెబ్బతినకుండా..
మల్బరీ పండ్లు యాంటీఆక్సిడెంట్ కెంటెంట్ కలిగి ఉంటాయి. దీనితో పాటు రెస్వెరాట్రల్, ఫ్లెవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలను తగ్గిస్తాయి. మల్బరీస్ డైటరీ ఫైబర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.