Share News

Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!

ABN , Publish Date - Jun 22 , 2024 | 01:40 PM

జీవక్రియను పెంచడంలో వాము మంచిగా పనిచేస్తుంది. ఇందులోని థైమోల్ అనే ఎంజైమ్ కారణంగా గ్యాస్ట్రిక్ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీల బర్నింగ్ చేయడంలో సహకరిస్తుంది. బరువు తగ్గాలన్నా కూడా వాము నీరు చక్కగా పనిచేస్తుంది.

Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!
Health Benefits

కాస్త జలుబు చేసినా, కడుపు నొప్పి ఉన్నా డాక్టర్ల దగ్గరకు వెళిపోతుంటాం. వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లు వాడేసి తగ్గిందనిపిస్తాం. కానీ ప్రతి చిన్న విషయానికి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కలిగే ఉపయోగాల కన్నా, కాలం గడిచే కొద్దీ పొందే అనర్థాలే ఎక్కువ. అందుకే మన పెద్దవారు ప్రతి దానికి ఇంటి చిట్కాలను వాడేవారు. మన వంటింటిలోని ప్రతి పదార్థమూ ఆరోగ్యాన్నిచ్చేది. అందులో ఒకటి వాము.

వాము నీరు (Ajwain Water)శరీరానికి చాలా మంచిది. పూర్వం నుంచి వామును చాలా రకాల అనారోగ్యాలలో వాడుతూనే ఉన్నాం. అంతే కాకుండా మన ఆహారంలో భాగం చేసుకున్నాం కూడా. పిల్లల్లో, పెద్దల్లో వాము నీరు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కడుపు తేలిగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే వాము గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

వాము వాటర్ ఎందుకు తాగాలి.

జీవక్రియను పెంచడంలో వాము మంచిగా పనిచేస్తుంది. ఇందులోని థైమోల్ అనే ఎంజైమ్ కారణంగా గ్యాస్ట్రిక్ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీల బర్నింగ్ చేయడంలో సహకరిస్తుంది. బరువు తగ్గాలన్నా కూడా వాము నీరు చక్కగా పనిచేస్తుంది. అదనపు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వాము నీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

yogurt face mask : ముఖానికి పెరుగు పూత మంచిదేనా.. దీనితో ఎలాంటి ఫలితాలుంటాయి..!


వామును గోరువెచ్చని, ఉప్పు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ ఇబ్బందిని తగ్గించి ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. బరువు తగ్గే సమయంలో తినాలనే కోరికను తగ్గించి వాము నీరు ఆకలిని అణిచివేస్తుంది. ఇది ఎక్కువకాలం పాటు కడుపు నిండుగా ఉండే విధంగా చేస్తుంది.

శరీరంలో పెరుగున్న అదనపు నీటిని వాము బయటకు పంపుతుంది. బరువు తగ్గేందుకు ఇది చక్కని మార్గం. ఎంత ఆహారాన్ని కంట్రోల్ చేసినా తగినంత వ్యాయామం లేకపోతే ఫలితం ఉండదు కనుక,. వ్యాయామాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలి. ఇంట్లో చిన్న వాటికి కూడా వాము వాడుతూనే ఉంటాం. కానీ దీనినే బరువు తగ్గేందు ప్రధాన పదార్థంగా తీసుకోవడం వల్ల సులువుగా బరువును తగ్గించుకుని ఊబకాయం సమస్య నుంచి బయట పడవచ్చు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 22 , 2024 | 01:40 PM