Summer heat : సమ్మర్ హీట్‌కి చెక్ పెట్టే సమ్మర్ డ్రింక్స్ తీసుకుంటే..!
ABN , Publish Date - Apr 20 , 2024 | 03:45 PM
వేసవిలో అతి సహజంగా లభించే పానీయాలలో ముఖ్యంగా చెప్పుకునేది కొబ్బరి నీరు. లేత కొబ్బరి బొండం నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది.
వేసవి కాలం పెరుగుతున్న ఎండల కారణంగా ఈ సమ్మర్ సీజన్లో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఉక్కపోత వల్ల మరింత దాహం పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చల్లగా ఏదైనా తాగితే కలిగే అనుభూతి అంతా ఇంతా కాదు. అయితే కూల్‌గా ఉండేలా మనకు మనం సహజంగా తయారు చేసుకున్న శీతల పానీయాలను, సేంద్రీయ పదార్థాలతో ఫ్రిపేర్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. దాహం తీరిన ఫీలింగ్ తగ్గేందుకు వేసవిలో వీటిని ఫ్రిపేర్ చేయండి.
కొబ్బరి నీరు..
వేసవిలో అతి సహజంగా లభించే పానీయాలలో ముఖ్యంగా చెప్పుకునేది కొబ్బరి నీరు. లేత కొబ్బరి బొండం నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీనితో శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. సుమారు 240 ml కొబ్బరి నీళ్లలో 60 కేలరీలు ఉంటాయి. పిండిపదార్థాలు 15 గ్రాములు, చక్కెర, పొటాషియంతో పాటు కొబ్బరి నీళ్లలో 94% నీరు ఉంటుంది.
చెరుకు రసం..
చెరుకు రసం మామూలుగా దొరికేదే.. దీనిలో నల్ల ఉప్పు, పుదీనా, నిమ్మకాయలతో తయారు చేసే ఈ చెరకు రసం మంచి రుచితో పాటు అధిక పోషకాలను కూడా కలిగి ఉంటుంది. చెరుకు రసంలో 180 కేలరీలు, 30 గ్రాముల పంచదార, ఫైబర్లు కూడా అధికంగా ఉంటాయి.
బేల్ షర్బెత్..(బిల్వ పండు)
చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన బిల్వ ( మారేడు పండు) తో తయారు చేసిన రసం దీనిని వేసవిలో తీసుకుంటే అనేక పోషకాలతో పాటు కెరోటిన్, ప్రోటీన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ బి1, బి2, కాల్షియం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.
Running : కీళ్లను బలహీనం చేసే రన్నింగ్ మిస్టేక్స్ ఇవే.. !
పుదీనా షర్బత్..
వేసవిలో చల్లని మజ్జిగాలో వేసే పుదీనా ఆకులు మంచి రుచిని ఇస్తాయి. దీనితో తయారు చేసే షర్బత్ కూడా మంచి రుచిని ఆరోగ్యాన్ని అందిస్తుంది. పుదీనాలో ఫాస్పరస్, కాల్షియం, విటమిన్లు, సి, డి, ఎ పుష్కలంగా ఉన్నాయి.
మజ్జిగ..
మంచి ఎండలో తీసుకునే గ్లాసుడు మజ్జిగ ఇచ్చే శక్తి, తృప్తిని ఇస్తుంది. శరీరాన్ని మజ్జిగ చల్లబరుస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో 110 కేలరీలు, 9 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల కార్బోహైడ్రోట్లు, కొవ్వు, చక్కెర ఉంటాయి.
ఆమ్ పన్నా..
పచ్చి మామిడికాయ గుజ్జు, జీర, పుదీనా ఆకులతో కలిపి తయారుచేసే ఆమ్ పన్నా శరీరానికి శక్తిని, మంచి రుచిని అందిస్తాయి. కేలరీలు, పిండి పదార్థాలతో పాటు అధికంగా ప్రోటీన్లు కూడా కలిగి ఉంది.
High cholesterol : ఈ లక్షణాలు గమనిస్తే ఇట్టే చెప్పచ్చు.. పురుషుల్లో అధిక కొలెస్ట్రాల్ ఉందని.. అవేమిటంటే..!
సత్తు షర్బత్..
సత్తు పొడి చానా ఉత్తర ప్రాంతాల్లో విస్తృతంగా తాగుతారు. దీనిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉన్నాయి.
బార్లీ నీరు..
వడకట్టిన బార్లీ నీరును వేసవిలో తీసుకోవడం వల్ల కేలరీలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అందుతాయి.
నిమ్మరసం..
వేసవిలోనే కాదు అన్ని కాలల్లోనూ తాగే విధంగా రుచిగా, ఆరోగ్యంగా ఉండే నిమ్మరసంలో కేలరీలు, ప్రోటీన్స్, చక్కెర, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.