Share News

Healthy liver : కాలేయం ఆరోగ్యానికి ఏ ఆహారాలు తీసుకోవాలి..!

ABN , Publish Date - Apr 20 , 2024 | 02:05 PM

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని కాటెచిన్ కంటెంట్ కారణంగా కాలేయ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది.

Healthy liver : కాలేయం ఆరోగ్యానికి ఏ ఆహారాలు తీసుకోవాలి..!
Healthy liver

జనాభాలో సుమారు 38% మంది కాలేయం కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతున్నారు. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. ఇది detoxificationతో పాటు చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. మొత్తం శరీర ఆరోగ్యానికి సంబంధించినంత వరకూ కాలేయం 500లకు పైగా విధులను నిర్వహిస్తుంది. అయితే దీని ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం.

పసుపు..

పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉండటం వల్ల దీనికి స్పష్టమైన రంగు ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మంటను తగ్గించడం, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి.

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని కాటెచిన్ కంటెంట్ కారణంగా కాలేయ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు మెరుగైన కాలేయ పనితీరుకు సహకరిస్తాయి. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

High cholesterol : ఈ లక్షణాలు గమనిస్తే ఇట్టే చెప్పచ్చు.. పురుషుల్లో అధిక కొలెస్ట్రాల్ ఉందని.. అవేమిటంటే..!

సిట్రస్ పండ్లు..

ద్రాక్షపండ్లు, కమలా, నారింజ, బత్తాయి పండ్లు సిట్రస్ పండ్లు. ఈ పండ్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

కూరగాయలు..

ఆరోగ్యకరమైన కాలేయం కోసం బ్రోకలీ, బ్రస్సెల్స్, మొలకలు, క్యాబేజీలలో గ్లూకోసినోలేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయలు detoxification కు సహాయపడే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.


Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!

చేపలు..

చేపలలో సాల్మాన్ చేపలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ కొవ్వు స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

దుంపలు..

దుంపలలో ఉండే బీటైన్ అనే పదార్థం కాలేయం detoxification ప్రక్రియకు మద్దతు ఇస్తుంది. ఇవి కాలేయ ఆరోగ్యానికి రుచికరమైనవి, పోషకమైనవి.

ఆలివ్ ఆయిల్..

ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కాలేయ వాపువు, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.

వాల్ నట్...

పోషకమైన ఆరోగ్యకరమైన ఆహారంలో వాల్ నట్ ముఖ్యమైనవి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 20 , 2024 | 02:06 PM