Share News

Nutritional Deficiency : పోషకాహార లోపాల కారణంగానే బరువు ఇట్టే పెరుగుతారు. ఇలా ఎందుకంటే..!!

ABN , Publish Date - May 27 , 2024 | 03:57 PM

హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. ఎర్ర రక్తకణాలలలో ప్రోటీన్ కణజాలాలకు కూడా ఆక్సిజన్ ను తీసుకువెళుతుంది. శరీరంలో తగినంత ఇనుము లేకుండా ఉంటే అలసట పెరుగుతుంది. బరువు పెరిగేలా చేస్తుంది.

Nutritional Deficiency : పోషకాహార లోపాల కారణంగానే బరువు ఇట్టే పెరుగుతారు. ఇలా ఎందుకంటే..!!
Nutritional Deficiency

ఎంత డైట్ చేస్తున్నా ఫలితం ఉండకపోవడం, బరువు అలాగే ఉండటం ఇలాంటి తేడాలు శరీరంలో పోషకాహారం లోపం కారణంగా కూడా వస్తాయి. హార్మోన్ నియంత్రణలో లేకపోవడం కారణంగా అంతరాయం కలుగుతుంది. దీనితో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

విటమిన్ డి లోపం..

జీవక్రియను నియంత్రించడంతో సహా అనేక శారీరక విధులను నిర్వహించడానికి విటమిన్ డి అవసరం. శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభించనపుడు అది నెమ్మదిగా అధిక కేలరీలు తీసుకోకపోవడం బరువు పెరిగేలా చేస్తుంది.

Health tips : రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన నిద్ర అలవాట్లు ఇవే.. !

ఒమేగా 3..

ఒమేగా 3 ఆకలిని నియంత్రించడంలో, కొవ్వు నిల్వలో ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో తగినంత లేనప్పుడు ఆకలి పెరుగుతుంది. చివరికి బరువు పెరిగేలా చేస్తుంది.

ప్రోటీన్ లోపం..

ప్రోటీన్ శరీరాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. ఇది తగినంత లేకపోతే కండరాలు బలహీనపడతాయి. అలాగే ఆకలి పెరుగుతుంది. బరువు కూడా పెరుగుతుంది.

ఇనుము లోపం..

హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. ఎర్ర రక్తకణాలలలో ప్రోటీన్ కణజాలాలకు కూడా ఆక్సిజన్ ను తీసుకువెళుతుంది. శరీరంలో తగినంత ఇనుము లేకుండా ఉంటే అలసట పెరుగుతుంది. బరువు పెరిగేలా చేస్తుంది.


Super Foods : కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఆహారాలు ఇవే..

మెగ్నీషియంలోపం..

మెగ్నీషియం శరీరంలోని అనేక ముఖ్యమైన జీవరసాయన ప్రతిచర్యలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో జీవక్రియ కూడా ఉంటుంది. తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉంటే బరువు కూడా పెరుగుతారు.

జింక్ లోపం..

జింక్ తగినంత లేకుంటే శరీరం ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కష్టపడుతుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు.

విటమిన్ బి లోపం..

శరీరానికి శక్తి సరఫరా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరం అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువగా తినడం అనేది ఉంటుంది. దీనితో బరువు పెరుగుతారు.

ఫైబర్ జీర్ణవ్యవస్థకు క్లీనర్‌గా పనిచేస్తుంది. ఇది వ్యర్థాలను తుడిచిపెట్టే విధంగా చేస్తుంది. అయితే ఫైబర్ లేకుండా ఉంటే ఆహార కణాలు పొట్టనుంచి తొలిపోవు. ఉబ్బరం కలుగుతుంది. అతిగా తినేలా చేస్తుంది. బరువు పెరిగేందుకు కూడా ఇది ప్రధాన కారణం అవుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 27 , 2024 | 03:58 PM